- తన లైనప్ లోని అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసిన ఎంజి
- రూ. 14.95 లక్షలతో ప్రారంభమైన ధరలు
ఎంజి మోటార్ ఇండియా ఫిబ్రవరి 2024లో తన అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసింది. అందులో హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలపై కూడా రూ.60,000 వరకు ధరలు తగ్గడంతో ప్రస్తుతం, ఈ రెండు ఎస్‌యూవీలు మరింత చవకగా లభించనున్నాయి. దీంతో, హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ రేంజ్ ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 14.95 లక్షలు మరియు రూ. 17.75 లక్షలతో ప్రారంభమయ్యాయి.
హెక్టర్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో అనే ఆరు వేరియంట్లలో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, హెక్టర్ ప్లస్ 6 వేరియంట్లలో, 6 మరియు 7-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
మెకానికల్ గా, ఈరెండు ఎస్‌యూవీలు 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్సుతో స్టాండర్డ్ గా జత చేయబడగా, ఇక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే పరిమితం చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్