- షార్ప్ ప్రో వేరియంట్ అధారంగా వచ్చిన లిమిటెడ్ ఎడిషన్
- కొత్త ఎవర్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందిన వివిధ మోడల్స్
ఎంజి మోటార్ ఇండియా దాని వంద వసంతాల వేడుకలను అన్ని మోడల్స్ లో స్పెషల్ ‘100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్’ అనే స్పెషల్ వేరియంట్ ని ప్రవేశపెట్టి ఘనంగా ఆరంభించింది. కామెట్, ఆస్టర్, హెక్టర్, మరియు ZS ఈవీ అనే మోడల్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. లాంచ్ తర్వాత, ఇప్పుడు హెక్టర్ యొక్క “100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్” అనే స్పెషల్ వేరియంట్ దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంది.
ఎక్స్‌టీరియర్ పరంగా, కారు బయటి వైపు ఈ స్పెషల్ ఎడిషన్ బ్రిటిష్ రేసింగ్ లైనేజ్ కి నివాళిని అర్పిస్తూ దానికి చిహ్నంగా ఎవర్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, ఈ కార్లు బ్లాక్డ్-అవుట్ రూఫ్ తో డ్యూయల్-టోన్ ఫినిష్, బ్లాక్డ్-అల్లాయ్ వీల్స్, డీకాల్స్ మరియు గ్రాఫిక్స్, మరియు “100-ఇయర్ ఎడిషన్” అనే బ్యాడ్జింగ్ ని పొందాయి.
ఇంటీరియర్ పరంగా, ఈ మోడల్స్ క్యాబిన్ బ్లాక్ థీమ్ తో ఫ్రంట్ సీట్ హెడ్ రెస్ట్స్ పై “100-ఇయర్ ఎడిషన్” మస్కట్ ఎంబ్రాయిడరీ వంటి ఫీచర్ ని పొందాయి. ఇంకా చెప్పాలంటే, ఈ కార్లలోని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లు కస్టమైజ్ విడ్జెట్లతో ఎవర్ గ్రీన్-కలర్డ్ థీమ్ ని పొందాయి.
మెకానికల్ గా, హెక్టర్ ఎస్‍యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ మోటార్ వంటి ఇంజిన్లతో కొనసాగుతుంది. మొదటి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్ లతో జత చేయబడి అందించబడుతుండగా, 2.0-లీటర్ డీజిల్ మోటార్ కేవలం మాన్యువల్ యూనిట్ తో మాత్రమే జత చేయబడి అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్