- రూ.41.05 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉన్న కొత్త ఎడిషన్ల ధర
- గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ తో పోలిస్తే రూ. 2.82 లక్షలు తక్కువగా వీటి ధర
ఎంజి మోటార్ ఇండియా గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ ఎడిషన్లను ఇండియాలో రూ.41.05 లక్షల ఎక్స్-షోరూం ధరతో పరిచయం చేసింది. గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ప్రేరణతో వచ్చిన డెజర్ట్ స్టార్మ్ డీప్ గోల్డెన్ పెయింట్ ని పొందగా, స్నో స్టార్మ్ ఎడిషన్ కారు బ్లాక్ రూఫ్ థీమ్ తో పెర్ల్ వైట్ కలర్ తో వచ్చింది.
ఇక గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ గురించి చెప్పాలంటే, ఈ ఇటరేషన్లో రెడ్ కలర్డ్ బ్రేక్ కాలిపర్స్ మరియు హెడ్ ల్యాంప్స్ కోసం ఇన్సర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా గ్రిల్ బ్లాక్డ్-అవుట్ ఫినిష్ ని, అల్లాయ్ వీల్స్, ఓఆర్‍విఎం, డోర్ హ్యండిల్స్, రూఫ్ రెయిల్స్, స్పాయిలర్ మరియు పిల్లర్స్ వంటి ఫీచర్లను అందుకుంది. ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, బ్లాక్ ఇంటీరియర్ థీమ్ తో రాగా స్టీరింగ్ వీల్‌కు మాత్రమే ఈ మార్పులు పరిమితం చేయబడ్డాయి.
2024 ఎంజి గ్లోస్టర్ స్నో స్టార్మ్ ఎడిషన్ కారు ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు హెడ్ ల్యాంప్స్ రెడ్ ఇన్సర్ట్స్ ని ప్రదర్శిస్తుండగా, గ్రిల్, అల్లాయ్స్, స్పాయిలర్, డోర్ హ్యాండిల్స్, రెడ్ ఇన్సర్ట్‌తో కూడిన ఓఆర్‍విఎం, విండో సరౌండ్స్ మరియు ఫాగ్ లైట్ గార్నిష్ వంటి ఎలిమెంట్లు గ్లోస్ బ్లాక్‌లో ఫినిషింగ్ తో వచ్చాయి. ఇందులో ఇంకొక హైలైట్ ఏంటి అంటే, టెయిల్ లైట్స్ స్మోక్డ్ ఎఫెక్ట్ ని కలిగి ఉన్నాయి. ఇంటీరియర్లో మార్పుల విషయానికి వస్తే, ఇది బ్లాక్ థీమ్ ఇంటీరియర్ మరియు బ్లాక్ స్టీరింగ్ వీల్ తో వచ్చింది.
గ్లోస్టర్ లోని స్నో స్టార్మ్ మరియు డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్లు రెండూ డెజర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ బ్యాడ్జెస్, సీట్ మసాజర్స్,థీమ్డ్ కార్పెట్ మ్యాట్స్, డ్యాష్ బోర్డ్ మ్యాట్స్, మరియు జెబిఎల్-సోర్స్డ్ స్పీకర్స్ వంటి డీలర్-లెవెల్ యాక్సెసరీస్ తో అందుబాటులోకి వచ్చాయి.
కొత్త ఎంజి గ్లోస్టర్ స్పెషల్ ఎడిషన్ల ఎక్స్-షోరూం ధర రూ. 41.05 లక్షలుగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ రెండు వెర్షన్ల ధర బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కంటే రూ. 2.82 లక్షలు తక్కువగా ఉంది. ఈ రెండు ఎడిషన్లు 7-సీటర్ లేఅవుట్లో అందించబడగా, డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ 6-సీటర్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్