- రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌తో రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందిన గ్లోస్టర్
- మెకానికల్‍గా ఎటువంటి మార్పులు లేకుండా ఉండే అవకాశం
ఎంజి మోటార్ ఇండియా దాని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే, మేము అదే టెస్ట్ మ్యూల్ రైడ్ చేస్తూ అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేస్తుండగా గుర్తించాము. అయితే, వెలువడిన కొత్త ఫోటోల ద్వారా వెల్లడైన మరిన్ని వివరాలను మేము ఈ కథనంలో కవర్ చేయనున్నాము.
ఫోటోలో చూసినట్లుగా, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ మరింత లావుగా మరియు నిటారుగా ఉండే ఫాసియాను ప్రదర్శిస్తుంది. ఇది సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్ ని పొందగా, అవిసమానమైన స్లాట్‌స్ తో విశాలమైన గ్రిల్, నిలువుగా అమర్చిన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు స్కూప్-అవుట్ బానెట్‌తో లోడ్ అవుతుంది.
మరో వైపు, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ఇటరేషన్ ని సిల్హౌట్‌తో కొత్త అల్లాయ్ వీల్స్ నుండి ప్రయోజనం పొందుతుంది. కార్ వెనుక భాగం విషయానికొస్తే, కనెక్టింగ్ లైట్ బార్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ మరియు కొద్దిగా ట్వీక్ చేయబడిన టెయిల్‌గేట్‌తో రివైజ్ చేసి ఉన్న టెయిల్‌లైట్స్ రూపంలో చిన్న చిన్న మార్పులతో వస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ప్రస్తుతం దీని కేటగిరిలో గ్లోస్టర్ మోడల్ ఎక్కువ ఫీచర్లతో మోస్ట్ ఫీచర్-ప్యాక్డ్ మోడల్‌గా ఉంది. అలాగే, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ కూడా అనేక ఫీచర్లను అందిస్తూ కొనసాగనుంది. ఇది పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లతో రానుంది.
మెకానికల్‍గా, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత వెర్షన్ వలె అదే పవర్‌ట్రెయిన్‌తో ఉంటుంది. అలాగే, 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు టర్బో మరియు ట్విన్-టర్బో టైపులో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ లతో కొనసాగనుంది. లాంచ్ అయిన తర్వాత, అప్‌డేట్ చేయబడిన ఎంజి గ్లోస్టర్, సేల్స్ లో అధికమార్కెట్ షేర్ ని కలిగి ఉన్న టయోటా ఫార్చూనర్ తో పాటుగా, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి కార్లతో పోటీ పడుతుంది.
ఫోటో క్రెడిట్స్ : రష్ లేన్
అనువాదించిన వారు: రాజపుష్ప