- ఎల్ఈడీ డిఆర్ఎల్స్ డిజైన్ వివరాలు లీక్
- మెకానికల్‍గా ఎటువంటి మార్పులు లేకుండా ఉండే అవకాశం
ఎంజి మోటార్ ఇండియా త్వరలో ప్రపంచవ్యాప్తంగా అప్‌డేట్ చేయబడిన ఎల్ డివి D90/మాక్సస్ D90 రీబ్యాడ్జ్ వెర్షన్‌ను ఇండియాలో గ్లోస్టర్‌గా విక్రయించనుంది. అలాగే, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్టెడ్ ఇటరేషన్ లో సరికొత్త మార్పులతో ఇంటీరియర్ డిజైన్ అప్‌గ్రేడ్‌ల నుండి బెనిఫిట్లను పొందుతుంది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ భారీగా ఉన్న త్రీ-స్లాట్ గ్రిల్ మరియు మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బ్రాండ్ లోగోతో కొత్త ఫాసియాను ప్రదర్శిస్తుంది. ఇంకా చెప్పాలంటే, హెడ్‌లైట్స్ క్యూబ్-షేప్డ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో కొత్త లుక్ ను పొందుతాయి. ఆపై, ఎల్ఈడీ డిఆర్ఎలస్ గ్రిల్‌లోకి విస్తరించబడి, అప్‌డేట్ చేయబడిన గ్లోస్టర్ ఫ్రంట్ ప్రొఫైల్‌కు చక్కని గుర్తింపును తీసుకువస్తాయి.
మరో వైపు, ప్రస్తుత వెర్షన్ వలె ఇంతకు ముందు ఉన్న అదే అల్లాయ్ వీల్స్‌పై టెస్ట్ మ్యూల్ రైడ్ చేస్తూ కనిపించింది. అయితే ఈ మోడల్ లాంచ్ సమయానికి కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందుతుందని మేము భావిస్తున్నాము. వెనుక వైపు, ఫుల్-సైజ్ ఎస్‌యువి కనెక్టింగ్ లైట్ బార్‌తో రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను పొందుతుంది.
ఫీచర్ల విషయానికొస్తే, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి ఫీచర్స్ తో కొనసాగవచ్చు.
మెకానికల్‍గా, ఎంజి పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు.అలాగే, ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఈ ఇంజిన్ రెండు రకాలుగా అందించబడుతుంది- టర్బో మరియు ట్విన్-టర్బో, ఇదిమాక్సిమం 213bhp పవర్ అవుట్‌పుట్ మరియు 478Nm మాక్సిమం టార్క్ నుఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప