- మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం
- రివైజ్డ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో లభ్యం
ప్రస్తుతం ఎంజి గ్లోస్టర్ మోడల్ సేల్స్ పెద్దగా లేకపోవడంతో, సేల్స్ ఊపందుకునేలా మరిన్ని ఫీచర్లను జోడించి మరియు సరికొత్త డిజైన్ తో తీసుకువచ్చి, త్వరలోనే గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. దాని లాంచ్‌కు ముందు కంపెనీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ను చేస్తూ మళ్ళీ కనిపించింది. అలాగే, ఇటీవలే వెబ్‌లో షేర్ చేసిన కొత్త స్పై షాట్‌ల ద్వారా అప్‌డేట్ చేయబడిన మూడు-వరుసల ఎస్‌యూవీ ఇంటీరియర్ వివరాలను లీక్ చేసింది.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూస్తే, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ మాక్సస్ D90 ఆధారంగా రూపొందించబడిన, సరికొత్త టైల్‌లైట్‌లను మరియు వెనుక వైపు ట్వీక్ చేయబడిన ఎగ్జాస్ట్ సెటప్‌ను పొందుతుంది. ఫాసియాలో ముఖ్య మైన మార్పులలో కొత్త గ్రిల్, రివైజ్డ్ లైటింగ్ సెటప్ మరియు రిఫ్రెష్ చేసిన బంపర్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్
లోపలి భాగంలో చూస్తే, 2025 ఎంజి గ్లోస్టర్‌లో దాదాపుగా కొత్త మార్పులు ఉంటాయి. అవి ఏమిటంటే, సెంటర్ కన్సోల్ కొత్త మరియు పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్, స్క్వేర్డ్ ఏసీ వెంట్స్ మరియు డ్యూయల్ వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్స్, రీపొజిషన్ చేసిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ స్విచ్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇప్పుడు రెండు రోటరీ డయల్స్ మరియు మూడు డిఫరెన్షియల్ లాక్ బటన్స్ ఉన్నాయి. అలాగే, డైమండ్ స్టిచింగ్‌తో కూడిన బ్లాక్ అప్‌హోల్స్టరీ కూడా ఆఫర్‌లో ఉండవచ్చు.
గ్లోస్టర్ అవుట్‌గోయింగ్ వెర్షన్ నుండి పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి కొన్ని కీలక ఫీచర్లు అందించబడతాయి. అలాగే, హుడ్ కింద, టర్బో మరియు ట్విన్-టర్బో రూపాల్లోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ను పొందవచ్చు. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లలో ఎటువంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప