- రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ తో రానున్న ఫేస్‍లిఫ్ట్ మోడల్
- ఫేస్‍లిఫ్ట్ లో కూడా ఒకే విధమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగే అవకాశం
ఎంజి ఇండియా ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ గ్లోస్టర్ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ పై ముమ్మరంగా పనిచేస్తుంది. తాజాగా ఈ మోడల్ మరోసారి ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఫ్రెష్ స్పై షాట్స్ చూస్తే, కొత్త గ్లోస్టర్ డిజైన్ లో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఫోటోలలో చూస్తే, గ్లోస్టర్ ఎస్‍యూవీ ముందు వైపు విశాలమైన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు ఒకే విధమైన సైడ్ ప్రొఫైల్ ఉన్నాయి. ఇంకా రియర్ ప్రొఫైల్ చూస్తే, పెద్దగా మార్పులు ఏవీ కనిపించడం లేదు. కానీ, మొత్తానికి కొత్త రియర్ బంపర్, కనెక్టింగ్ లైట్ బార్ తో రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్ ని పొందనుంది.
ఫీచర్ల పరంగా, ఈ ఎస్‍యూవీలో భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) సూట్ వంటి హై-ఎండ్ ఫీచర్లను కొనసాగించనుంది.
మెకానికల్ గా, ఎంజి గ్లోస్టర్ ఫేస్‍లిఫ్ట్ ఎలాంటి మార్పులు లేకుండా ఇంతకు ముందు ఉన్న 2.0-లీటర్ డీజిల్ మోటారుతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ ని టర్బో మరియు ట్విన్-టర్బో అనే రెండు రకాలలో పొందవచ్చు. అదే విధంగా, ఈ రెండు పవర్ ట్రెయిన్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి రానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్