- రూ.41.05 లక్షలతో ధరలు ప్రారంభం
- టర్బో మరియు ట్విన్-టర్బో టైపులలో అందించబడిన ఎంజి గ్లోస్టర్
ఎంజి మోటార్ ఇండియా తాజాగా గ్లోస్టర్ స్టార్మ్ సిరీస్ లో డెజర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ అనే రెండు కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది. దీంతో, గ్లోస్టర్ మోడల్ ని ఇప్పుడు బ్లాక్ స్టార్మ్, డెజర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ అనే మూడు స్పెషల్ ఎడిషన్లలో పొందవచ్చు. గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ లాంచ్ తర్వాత, ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ ఇండియా వ్యాప్తంగా డీలర్‌షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఎంజి గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ని టర్బో మరియు ట్విన్-టర్బో టైపులలో రూ.41.05 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ ఎస్‍యూవీ వెర్షన్ గ్రిల్ అంతటా బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్లను, ఓఆర్‌విఎం, డోర్ హ్యండిల్స్, రూఫ్ రెయిల్స్, పిల్లర్స్, స్పాయిలర్స్, మరియు అల్లాయ్ వీల్స్ పై డీప్ గోల్డెన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఫినిషింగ్ ని పొందింది. ఇంకా బ్రేక్ కాలిపర్స్ పై మరియు హెడ్ ల్యాంప్ క్లస్టర్ లోపలి భాగంలో రెడ్ కలర్ యాక్సెంట్స్ దీనికి మరింత అందాన్ని చేకూర్చాయి.
బ్లాక్ క్యాబిన్‌తో కారు లోపలి భాగంలో కూడా ఇదే థీమ్ కొనసాగించబడింది. మొత్తానికి, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లాగా కాకుండా, డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ మోడల్ క్యాబిన్ లోపల రెడ్ యాక్సెంట్స్ ని మిస్ అయ్యింది. ముఖ్యంగా, కస్టమర్లు ఈ కొత్త ఎడిషన్ ని 6-సీటర్ లేదా 7-సీటర్ లేఅవుట్ తో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్