గత సంవత్సరం చివరలో గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ని ఎంజి మోటార్స్ పరిచయం చేయగా, స్టార్మ్ ఫ్యామిలీని మరింత విస్తరిస్తూ ఎంజి కంపెనీ ఇందులో స్నో స్టార్మ్ మరియు డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్లను తీసుకువచ్చింది. ఇప్పుడు మనం గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లో ఉన్న హైలైట్స్ గురించి తెలుసుకుందాం.
గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ మరియు ఇతర స్టార్మ్ ఎడిషన్ల మధ్య మొదటి మరియు అతి ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి అంటే, ఇది డీప్ గోల్డెన్ కలర్లో వచ్చింది. దాని తర్వాత రెండోది ఏంటి అంటే, హెడ్ ల్యాంప్ క్లస్టర్లతో పాటుగా బ్లాక్ గ్రిల్ పై రెడ్ ఇన్సర్ట్స్ ని కలిగి ఉంది. కారు చుట్టూ అంతటా వివిధ బ్లాక్డ్-అవుట్ అంశాలను కలిగి ఉంది. అందులో ఒఆర్విఎం, రూఫ్ రెయిల్స్, డోర్ హ్యండిల్స్, స్పాయిలర్, మరియు ఫెండర్ గార్నిష్ వంటివి ఉన్నాయి. వీల్స్ కూడా గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్ ని పొందగా, దాని వెనుక కాంట్రాస్టింగ్ రెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి.
ఎంజి గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ లోపల చూస్తే, మీకు లోపల అంతటా ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో ఇతర మార్పుల విషయానికి వస్తే, వైట్ స్టిచింగ్ తో బ్లాక్ స్టీరింగ్ వీల్ కనిపిస్తుంది. మీరు డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్ ని 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా, స్టార్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్నో స్టార్మ్ ఎడిషన్ కేవలం 7-సీటర్ లేఅవుట్ లో మాత్రమే అందించబడింది.
మూడు-వరుసల ఎస్‌యూవీలో గుర్తించదగిన ముఖ్యమైన ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-1 ఎడాస్ (ఏడీఏఎస్), ఐ-స్మార్ట్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, పవర్డ్ టెయిల్‌గేట్, 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టంమరియు మరిన్నో ఉన్నాయి.
ఎంజి కంపెనీ గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లో మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు. గ్లోస్టర్ లో ఇంతకు ముందు అందించిన వాటినే ఇందులో కూడా కొనసాగిస్తుంది. ఇది టర్బో మరియు ట్విన్ టర్బో అనే రెండు రకాల 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉండగా, దీనిని 4x2 మరియు 4x4 వెర్షన్లలో పొందవచ్చు. మొదటి ఇంజిన్ 159bhp మరియు 373Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవ ఇంజిన్ 213bhp మరియు 478Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ లైనప్ లోని అన్ని వెర్షన్లలో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సు స్టాండర్డ్ గా అందించబడింది.
ఎంజి గ్లోస్టర్ కారుతో పోటీపడే కార్ల విషయానికి వస్తే, ఇందులో టయోటా ఫార్చునర్, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్, మరియు ఇసుజు MU-X వంటి కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఎంజి కంపెనీ ప్రస్తుతం ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ పై వర్క్ చేస్తుండగా, ఇది ఈ సంవత్సరం చివరలో వచ్చే అవకాశం ఉంది.
వేరియంట్-వారీగా ఎంజి గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ ఎడిషన్ల ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | గ్లోస్టర్ డెజర్ట్ స్టార్మ్ (ఎక్స్-షోరూం) | గ్లోస్టర్ స్నో స్టార్మ్ (ఎక్స్-షోరూం) | |
6-సీటర్ | 7-సీటర్ | 7-సీటర్ | |
డీజిల్ ఎటి 4x2 టర్బో | రూ. 41,04,800 | రూ. 41,04,800 | |
డీజిల్ ఎటి 4x4 ట్విన్-టర్బో | రూ. 43,86,800 | రూ. 43,86,800 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్