- అన్ని ఇతర వేరియంట్స్ పై ఎటువంటి మార్పు లేని ధరలు
- టర్బో మరియు ట్విన్-టర్బో రెండింట్లో లభిస్తున్న మోడల్
ఎంజి మోటార్ ఇండియా తన మొత్తం రేంజ్ ధరలను ఫిబ్రవరి 2024లో అప్డేట్ చేసింది. సెలెక్ట్ చేసిన మోడళ్ల పై ధరలు గణనీయంగా తగ్గించబడ్డాయి.ఈ లిస్ట్ లో ఉన్నఫ్లాగ్షిప్ గ్లోస్టర్ ఎస్యూవీ మాత్రం రూ. 1.34 లక్షల వరకు ధర తగ్గింపును పొందింది.
ఎంజి గ్లోస్టర్ షార్ప్, సావి మరియు బ్లాక్‌స్టార్మ్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త ధరల అప్డేట్ విషయానికి వస్తే, బ్లాక్‌స్టార్మ్ వేరియంట్లపై ధరలు రూ. 1.34 లక్షలు వరకు తగ్గాయి. అలాగే, టర్బో మరియు ట్విన్-టర్బో మోడల్ పై వరుసగా ధర రూ. 87,000 వరకు తగ్గింది.
మెకానికల్ గా, గ్లోస్టర్ ఎస్యువి రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. - 2.0-లీటర్ టర్బో డీజిల్ మరియు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్. ఈ రెండు పవర్‌ట్రెయిన్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి.
వేరియంట్ వారీగా ఎంజి గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ధరలు |
బ్లాక్‌స్టార్మ్ టర్బో డీజిల్ | రూ. 39.71 లక్షలు |
బ్లాక్‌స్టార్మ్ ట్విన్ -టర్బో డీజిల్ | రూ. 42.99 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప