- 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్న కామెట్
- ఒక్క సింగిల్ ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల ప్రయాణం
ఎంజి మోటార్ కంపెనీ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, ఇండియాలోని కస్టమర్స్ అందరూ గుర్తించుకునేలా దీన్ని ఒక వేడుకలా చేయాలని ఎంజి మోటార్ ఇండియా తమ అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసింది. ఆ లైనప్ లో ఉన్న కామెట్ ఈవీపై ఒక లక్ష రూపాయలను తగ్గించింది. కామెట్ ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పక్కా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం, ఎంజి కామెట్ ఈవీని పేస్, ప్లే, మరియు ప్లస్ అనే 3 వేరియంట్లలో పొందవచ్చు. ఎంజి మోటార్ ఇండియా ఎంట్రీ-లెవెల్ పేస్ వేరియంట్ ధరలను వెల్లడించి, మిగతా రెండు వేరియంట్ల ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
17.3kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉన్న కామెట్ ఈవీని పూర్తిగా ఛార్జ్ చేయాలంటే 7 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటార్ సహాయంతో 41bhp మరియు 110Nm టార్కును ఉత్పత్తి చేయడమే కాక, సింగిల్ ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, మేము కామెట్ ఈవీని డ్రైవ్ చేయగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని అందిస్తూ, 191 కిలోమీటర్ల రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్