ఎలక్ట్రిక్ వెహికిల్స్ పెరుగుతున్న కాలంలో వాటి డ్రైవింగ్ రేంజ్ ఆసక్తికరంగా మారింది. అందుకే, మేము ఈ ఆర్టికల్ లో ఎంజి కామెట్ ఈవీ మరియు టాటా టియాగో ఈవీకి సంబంధించి రెండింటి మధ్య ఉన్న రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ను మీకు తెలియజేయబోతున్నాము.
ఎంజి కామెట్ ఈవీ
కామెట్ ఈవీ ఒక చైనా-బేస్డ్ బ్రిటిష్ కార్ మార్క్, ఎంజి మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ మోడల్ లో అందించబడుతున్న వాటిలో రెండవది. ఇది ఏప్రిల్ 2023లో లాంచ్ కాగా పేస్, ప్లే మరియు ప్లష్ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది, దీని ధరలు రూ. 7.98 లక్షల నుండి రూ. 10.63 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
కామెట్ ఈవీ17.3kWh బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ ని పొంది, దీని మోటార్ 41bhp మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీనిని ఒకసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే క్లెయిమ్ చేయబడిన 230 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది మరియు 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి దీనిని కేవలం 7 గంటల్లో 0-100% వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఇప్పుడు, మేము ఈ కాంపాక్ట్ ఈవీని మేము ముందే నిర్దారించుకున్న మార్గంలో టెస్ట్ చేసినప్పుడు, కొంచెం హైవే డ్రైవింగ్‌తో పాటు మోడరేట్ నుండి హెవీ సిటీ ట్రాఫిక్‌కు అనుకూల పరిస్థితుల్లో కామెట్ ఫుల్ ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో 191 కిలోమీటర్ల రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.
టాటా టియాగో ఈవీ
ప్రస్తుతం, టాటా లైనప్‌లో ఉన్న వాటిలో టియాగో ఈవీ అత్యంత సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ వాహనం. ఇది XE, XT, XZ ప్లస్మరియు XZ ప్లస్ టెక్ వేరియంట్స్ లో అందించబడుతుండగా, ఈ కారు ధరలు రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూం) తో ప్రారంభమై మరియు టాప్-స్పెక్ వేరియంట్ లో రూ. 12.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
టియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. అవి ఏవి అంటే - 19.2kWh మరియు 24kWh, ఇదివరుసగా 250 కిలోమీటర్లు మరియు 315 కిలోమీటర్ల ఎంఐడిసి-సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది. ఇంతకు ముందున్నది 60bhp మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 74bhp మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7.2kW డిసి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, టియాగో ఈవీని కేవలం 57 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే, మేము టెస్ట్ చేసిన కారు 24kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడింది. దీన్ని 100% ఛార్జ్ చేసిన తర్వాత, మేము ట్రిప్ మీటర్‌ను రీసెట్ చేసి, మేము ముందే నిర్దేశించుకున్న మార్గంలో దీని బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు డ్రైవ్ చేశాము. బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయగా ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ దాదాపు 214 కిలోమీటర్ల దూరాన్ని ఈజీగా కవర్ చేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్