- స్మార్ట్ ఈవీ రేంజ్ లో ఎక్సైట్ ఎఫ్‍సి, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‍సి వేరియంట్లను తీసుకువచ్చిన ఎంజి
- ఇప్పుడు రూ.6.98 లక్షలతో ఎంజి కామెట్ ధరలు ప్రారంభం
చాలా రోజుల నుంచి ఎంజి కామెట్ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదనే భావన ఎంజి కస్టమర్లకు ఉండేది. ఇప్పుడు వాటన్నింటిని అధిగమిస్తూ ఎంజి కామెట్ ఈవీ రెండు సరికొత్త వేరియంట్లతో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ని తీసుకువచ్చింది. ఎంజి మోటార్స్ ఇండియా కామెట్ ఈవీలో ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఎక్సైట్ ఎఫ్‍సి, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‍సి అనే రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 8.23 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ. 9.13 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉన్నాయి. ఇంతకు ముందు కామెట్ ఈవీలో పుష్, ప్లే, పేస్ అనే మూడు వేరియంట్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఎంజి మోటార్స్ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే వాటిని తీసుకువచ్చింది.
కామెట్ ని ఛార్జింగ్ చేయడానికి తీసుకునే సమయం
ఇంతకు ముందు కామెట్ ఈవీని ఏసీ ఛార్జర్లతో ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 గంటలు మరియు 5 గంటల సమయం పట్టేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో కామెట్ ఈవీని కేవలం రెండు గంటల్లోనే ఛార్జ్ చేయవచ్చు.
సేఫ్టీ మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఎంజి కామెట్ ఈవీలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్, హిల్-హోల్డ్ కంట్రోల్, పవర్ ఫోల్డబుల్ ఓఆర్‌విఎం, టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, క్రీప్ మోడ్ మరియు బాడీ-కలర్ ఓఆర్‌విఎంలతో ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
ఎంజి కామెట్ ఈవీ | ఎగ్జిక్యూటివ్ | ఎక్సైట్ | ఎక్సైట్ ఎఫ్‍సి | ఎక్స్‌క్లూజివ్ | ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‍సి |
రూ. 6,98,800 | రూ.7,88,000 | రూ. 8,23,800 | రూ. 8,78,000 | రూ. 9,13,800 |
కొత్త వేరియంట్ల లాంచ్ పై ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “ఎంజి కంపెనీ నిరంతరం కొత్త ఆవిష్కరణలు మరియు ఆకర్షణీయమైన విలువ ప్రతిపాదనలతో కస్టమర్లకు బెస్ట్ ప్రొడక్ట్స్ అందించడానికి కట్టుబడి ఉంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత, మార్కెట్ సరళి మరియు ఇండస్ట్రీ అనాలిసిస్ ని ఉపయోగించి, మేము మా ఎంజి కామెట్ ఈవీలో కొత్త వేరియంట్‌లను పరిచయం చేసాము. మా ప్రొడక్ట్స్ పాటు, ఈవీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు అందుబాటులో ఉండేలా చేయడానికి ఈవీలపై అవగాహనను పెంపొందిస్తున్నాము మరియు ఈవీల ద్వారా ఎన్విరాన్మెంట్ రక్షించడానికి తమ వంతు పాత్ర సరిగ్గా పోషిస్తాము” అని తెలిపారు.