- ఎటువంటి మార్పు లేని ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర
- 3 వేరియంట్లలో లభ్యం
రెండు నెలల క్రితం ఎంజి మోటార్స్ ఇండియా కామెట్ ఈవీపై భారీ డిస్కౌంట్లను అందించింది. ఆ సమయంలో కామెట్ ఈవీలో పుష్, ప్లే, పేస్ అనే మూడు వేరియంట్లు ఉండేవి. తర్వాత వాటి స్థానంలో కొత్తగా ఎంజి మోటార్స్ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే మూడు వేరియంట్లను తీసుకురాగా, అందులో ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లను ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో లాంచ్ చేసింది. ఇప్పుడేమో ఈ వేరియంట్ల ధరలను కూడా పెంచింది. ఫాస్ట్ ఛార్జింగ్ రాక ముందు ఎంజి కామెట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు ఎంజి కామెట్ లోని సెలెక్ట్ వేరియంట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తీసుకురావడంతో కామెట్ ఈవీ సేల్స్ జోరందుకున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవడంతో ఎంజి ఇండియా దాని మొత్తం మోడల్స్ పై ధరలను పెంచింది. పెరిగిన ధరల లిస్ట్ లో, ఆటోమేకర్ ఇప్పటి వరకు మరింత చవకగా అందిస్తున్న మోడల్ కామెట్ ఈవీ కూడా ఉంది. దీనిపై ఒకేవిధంగా ఎంజి ధరలను పెంచింది.
ప్రస్తుతం, ఎంజి కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, తరువాతి రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ తో అందించబడ్డాయి. ధర అప్‌డేట్ విషయానికొస్తే, ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కాకుండా, ఇతర అన్ని వేరియంట్‌లపై స్టాండర్డ్ గా ధర రూ. 10 వేలు పెరిగింది. దీనితో, కామెట్ ఈవీ ధర ఇప్పుడు రూ. 6.99 లక్షలు ప్రారంభమై టాప్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి వేరియంట్ ధర రూ. 9.24 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ఎంజి కామెట్ ఈవీ కొత్త వేరియంట్ వారీ ధరలు క్రింద లిస్ట్ లో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు |
ఎగ్జిక్యూటివ్ | రూ. 6,98,800 |
ఎక్సైట్ | రూ. 7,98,000 |
ఎక్సైట్(ఫాస్ట్ ఛార్జ్) | రూ. 8,33,800 |
ఎక్స్‌క్లూజివ్ | రూ. 8,88,000 |
ఎక్స్‌క్లూజివ్(ఫాస్ట్ ఛార్జ్) | రూ. 9,23,800 |
ఎంజి కామెట్ ఈవీని రియర్ యాక్సిల్ మౌంటెడ్ సింగిల్ మోటార్ సెటప్ తో 17.3kWh బ్యాటరీ ప్యాక్ తో పొందవచ్చు. ఈ ట్యూన్ లో, చిన్న ఈవీ 41bhp మరియు 110Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే, కామెట్ ఇప్పుడు 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ మరియు 3.3kW ఏసీ ఛార్జర్ వంటి రెండు ఛార్జింగ్ ఆప్షన్ లని పొందింది. కామెట్ లో ఉన్న 7.4kW బ్యాటరీ ప్యాక్ ని ఏసీ ఫాస్ట్ చార్జర్ సహాయంతో కేవలం 2.5 గంటల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. కామెట్ ఈవీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ, మేము చేసిన దీనిని ఫుల్ ఛార్జ్ చేసి నిర్వహించిన రియల్-వరల్డ్ రేంజ్ టెస్టులో 191 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే అందించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప