- రూ. 9.40 లక్షలు ప్రారంభ ధరతో లభ్యం
- ఎవర్‌గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్‌ను పొందిన మోడల్
ఎంజి మోటార్ ఇండియా ఇటీవలే హెక్టర్, ఆస్టర్, ZS EV మరియు కామెట్ EV లలో 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు, లాంచ్ తర్వాత, కామెట్ EV స్పెషల్ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
కామెట్ EV 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 9.4 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది ఇంకా ముఖ్యమైన మార్పులలో కొత్త ఎవర్‌గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ హ్యూ, బ్లాక్-అవుట్ రూఫ్, డిఫ్యూజ్డ్ క్రోమ్ ఫినిషింగ్ మరియు టెయిల్‌గేట్‌పై డార్కెన్డ్ కామెట్ EV బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.
లోపలి భాగంలో, ఎవర్‌గ్రీన్ థీమ్ తో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ UIతో పూర్తిచేయబడింది. అంతేకాకుండా, ఈ వెర్షన్‌లో ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్స్ లపై మరింత కొత్త లుక్ తో '100-ఇయర్' మస్కట్‌లను ఎంజి పొందుపరిచింది.
కామెట్ EVని 17.3kWh బ్యాటరీ ప్యాక్ తో పొందవచ్చు, ఇది మోటారు 41bhp మరియు 110Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే, కామెట్ ఇప్పుడు 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ మరియు 3.3kW ఏసీ ఛార్జర్ వంటి రెండు ఛార్జింగ్ ఆప్షన్ లని పొందింది. మొదటి బ్యాటరీ ప్యాక్ కేవలం 2.5 గంటల్లో EVని 10 నుండి 80 శాతం వరకు ఛార్జర్ చేయగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప