- ఇండియాలో ఎంజి నుంచి వస్తున్న మూడవ ఈవీ ఇదేనా!
- వివిధ రేంజ్ ఆప్షన్లలో అందించే అవకాశం
ఎంజి క్లౌడ్ ఈవీ మోడల్ ఇండియాలో చాలాసార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. లేటెస్టుగా దీనికి సంబంధించిన పేటెంట్ ఫోటోలను కూడా మేము కలిగి ఉన్నాము. ఇప్పుడు, క్లౌడ్ ఈవీని ఇండియాలో సెప్టెంబర్-2024లో లాంచ్ చేస్తున్నట్లు ఎంజి కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు క్లౌడ్ ఈవీ పెద్ద ఫేస్, ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ, ఫ్లష్ డోర్ హ్యండిల్స్, మరియు ముందు వరకు పొడిగించి ఉన్న రూఫ్ లైన్ వంటి క్రాస్ ఓవర్ డిజైన్ తో స్పోర్ట్ లుక్ ని కలిగి ఉంది. అలాగే ఇది 2.7 మీటర్ల వీల్ బేస్ తో 4.3 మీటర్ల పొడవును కలిగి ఉంది.
క్లౌడ్ ఈవీ గురించి మనం చర్చించాల్సిన అతిపెద్ద హైలైట్ ఏంటి అంటే, ఇది పెద్ద ఫీచర్ లిస్టుతో వస్తుందని భావిస్తున్నాం. అందులో 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), సన్ రూఫ్, మరియు పవర్డ్ సీట్లు ఉండవచ్చు. అలాగే, ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 50.6kWh పవర్ ట్రెయిన్ తో జతచేయబడి అందించవచ్చని భావిస్తున్నాం. మనం సెలెక్ట్ చేసుకునే వేరియంట్ ని బట్టి ఈ బ్యాటరీ ప్యాక్ 460 కిలోమీటర్ల రేంజ్ ని అందించవచ్చు.
ఇది ఎంజి నుంచి మోస్ట్ ప్రీమియం ఈవీగా అందించబడనుండగా, దీని ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత క్లౌడ్ ఈవీ బివైడి E6 మోడల్ తో డైరెక్టుగా పోటీపడనుంది. ప్యాకేజీని చూస్తుంటే ఏం అర్థం అవుతుంది అంటే, న్యూ-ఏజ్ డ్రివెన్-మార్కెట్‌లో ఈ కారు రానుంది, అలాగే ప్రత్యేకంగా కూడా నిలవనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్