- ఎంజి నుండి అందించబడనున్న మూడవ ఎలక్ట్రిక్ కారు క్లౌడ్ ఈవీ
- సెప్టెంబర్‌లో ఇండియాలో లాంచ్ కానున్న క్లౌడ్ మోడల్
ఎంజి మోటార్ ఇండియా, ఇండియాలో క్లౌడ్ ఈవీని టెస్టింగ్ చేస్తూ ఉంది మరియు అనేక సందర్భాల్లో ఎంజి ఈవీకి సంబంధించిన స్పై షాట్‌లు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు, సెప్టెంబర్‌లో జరగబోయే దాని లాంచ్‌కు ముందు, కంపెనీ ఈ అప్ కమింగ్ (రాబోయే) కారు మొదటి టీజర్‌ను సీయూవీగా డబ్ చేస్తూ రిలీజ్ చేసింది.
ZS ఈవీ మరియు కామెట్ ఈవీ తర్వాత ఇండియన్ మార్కెట్లో ఈ బ్రాండ్ నుండి మూడవ ఈవీ అయిన ఎంజి క్లౌడ్ ఈవీ, దాని యూఎస్ పీ వలె విక్రయించబడే అవకాశం ఉంది.టీజర్ వీడియోలో చూసినట్లుగా, ఈ మోడల్ న్యూవీల్స్, సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఫాసియాపై ఎల్ఈడీ లైట్ బార్ మరియు బ్యాక్‌లిట్ ఎంజి లోగోను పొందుతుంది. అలాగే, రెండోది ఈ కారును ఛార్జ్ చేస్తున్నప్పుడు మాత్రమే యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, క్లౌడ్ ఈవీ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్స్ మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ వంటి మరిన్ని ఫీచర్స్ ను పొందుతుంది.
ప్రపంచవ్యాప్తంగా, అప్‌డేట్ చేయబడిన 2024 ఎంజి క్లౌడ్ ఈవీలోని 50.6kWh మరియు 37.9kWh బ్యాటరీ ప్యాక్‌లు ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఇది పైన పేర్కొన్న బ్యాటరీ ప్యాక్ ఆధారంగా వరుసగా 460కిలోమీటర్ల మరియు 360కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఈ కొత్త మోడల్ లాంచ్ ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక సరికొత్త ప్రోడక్ట్ ని ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురావడం అనేది ఎంజి ప్రారంభాన్ని సూచిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప