- సెప్టెంబర్-2024లో లాంచ్ అయ్యే అవకాశం
- ఎంజి పోర్ట్ ఫోలియోలో మూడవ ఈవీగా వస్తున్న క్లౌడ్ ఈవీ మోడల్
ఎంజి మోటార్ ఇండియా దాని కొత్త ఆల్-ఎలక్ట్రిక్ వెహికిల్ ని క్లౌడ్ ఈవీ రూపంలో ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మోడల్ సెప్టెంబర్-2024 రెండవ వారంలో దాని ఇండియా అరంగేట్రం చేయనుంది. దాని అధికారిక లాంచ్ కి ముందుగా, ఈ మోడల్ ప్రొడక్షన్ లోకి వెళ్లకముందు మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
ఇండియాలో వులింగ్స్ మోడల్ రీబ్రాండెడ్ వెర్షన్ గా క్లౌడ్ ఈవీ అదే పేరుతో రానుంది. డిజైన్ పరంగా, క్లౌడ్ ఈవీ కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, మరియు ఫ్రంట్ ఫెండర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ మోడల్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, డోర్ మౌంటెడ్ ఒఆర్‌విఎం, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లను కూడా పొందనుంది.
పొడవు పరంగా, ఎంజి క్లౌడ్ ఈవీ మోడల్ 4.3 మీటర్ల పొడవు ఉండగా, 460 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించడానికి 50.6kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు మరియు రేంజ్ ఆప్షన్లతో వివిధ వేరియంట్లలో అందించబడుతుందని మేము భావిస్తున్నాము.
లాంచ్ తర్వాత ఎంజి క్లౌడ్ ఈవీ మోడల్, ధర రేంజ్ ని బట్టి బివైడి e6 తో పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆటోమేకర్ నుంచి అత్యంత ఖరీదైన ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ గా క్లౌడ్ ఈవీ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్