- ఇండియాలో ఎంజి నుంచి మూడవ ఎలక్ట్రిక్ కారుగా అందించబడనున్న క్లౌడ్ ఈవీ
- గ్లోబల్ మార్కెట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందిన నయా మోడల్
గత నెలలో ఎంజి మోటార్ కొత్త క్లౌడ్ ఈవీని టెస్టింగ్ చేయడం ప్రారంభించగా, ఈ మోడల్ ని లోకల్ మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి కార్ మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు చిన్న క్లూని ఇస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ ఇండియాలో కామెట్ ఈవీ మరియు ZS ఈవీని ఎలక్ట్రిక్ మోడల్స్ గా అందిస్తుంది. ఇప్పుడు, బ్రాండ్ దీనిపై పేటెంట్ ని కూడా రిజిస్టర్ చేయడంతో, కంపెనీ నుంచి దీనిని మూడవ ఎలక్ట్రిక్ కారుగా విక్రయించే అవకాశం ఉంది.
పేటెంట్ ఫోటో ప్రకారం చూస్తే, ఈ కొత్త క్లౌడ్ ఈవీలో ఫాసియాపై ఎల్ఈడీ లైట్ బార్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, వైడ్ ఎయిర్ డ్యాం, ఎడమ వైపున ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డోర్ – మౌంటెడ్ ఓఆర్‍విఎం, బ్లాక్ రూఫ్, మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటి వాటిని పొందనుంది.
2024 ఎంజి క్లౌడ్ ఈవీ ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రియర్ ఏసీ వెంట్స్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హారిజాంటల్ గా పొజిషన్ చేయబడిన ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
గ్లోబల్ గా, ఎంజి క్లౌడ్ యొక్క 50.6kWh మరియు 37.9kWh బ్యాటరీ ప్యాక్స్ తో అందించబడగా, ఇవి ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి వరుసగా 460 కిలోమీటర్లు మరియు 360 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో వీటిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్