- పండుగ సీజన్‌లో లాంచ్ అయ్యే అవకాశం
- ఇండియాలో ఎంజి నుండి అందించబడనున్న మూడవ ఎలక్ట్రిక్ మోడల్
జెఎస్ డబ్ల్యూ-ఎంజి మోటార్ ఇండియా కొత్త క్లౌడ్ ఈవీని ఇండియాలో లాంచ్ చేయడానికి ముందుగా టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. దీని లాంచ్ ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో జరుగుతుందని భావిస్తున్నాం. అలాగే, వెబ్‌లో షేర్ చేసిన కొత్త స్పై షాట్‌లలో ఈ కారు కీలక వివరాలను వెల్లడయ్యాయి.
చిత్రాలలో చూసినట్లుగా, కార్‌మేకర్ నుండి అందించబడుతున్నఈ మూడవ ఎలక్ట్రిక్ కార్ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ కారులో కనిపించే ముఖ్యమైన అంశాలలో ఫాసియాకు ఇరువైపులా ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఎల్ఈడీ లైట్ బార్ అప్-ఫ్రంట్, మెయిన్ హెడ్‌లైట్ క్లస్టర్ కోసం క్రోమ్ ఇన్‌సర్ట్‌స్ మరియు లెఫ్ట్ ఫ్రంట్ ఫెండర్‌లో ఛార్జింగ్ ఫ్లాప్ వంటివి ఉన్నాయి.
మరోవైపు, ఇండియా-స్పెక్ క్లౌడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రియర్ బంపర్- మౌంట్ నెంబర్ ప్లేట్ రీసెస్ వంటి ఫీచర్లతో రానుంది.
క్లౌడ్ ఈవీ గ్లోబల్ మార్కెట్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ని పొందగా, వీటిలో ఏది ఒకటి, లేదా రెండూ , ఇండియా-స్పెక్ కారులో ఏది తయారు చేయబడుతుందో చూడాలి. ఆప్షన్లలో 460కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించే 50.6kWh యూనిట్ మరియు 360కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించే 37.9kWh యూనిట్ ఉన్నాయి .ఈ మోడల్, పండుగ సీజన్‌లో లాంచ్ అయినపుడు, ఇంకాప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్‌ను లాంచ్ చేయాలనే ప్లాన్‌లను ఎంజి బ్రాండ్ మొదలు(కిక్‌స్టార్ట్) పెట్టనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప