- అన్నీ మోడల్స్ కంటే అధికంగా పెరిగిన ఎంజి గ్లోస్టర్ ధర
- వచ్చే నెల నుంచి ధరలను పెంచనున్న వివిధ కార్ల కంపెనీలు
ఈ నెల ప్రారంభంలో, ఎంజి బ్రాండ్ తన మోడల్స్ రేంజ్ యొక్క పెంచిన ధరలను జనవరి 2024 నుండి అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.కార్‌మేకర్ ఇప్పుడు ప్రతి మోడల్‌పై పెరిగిన ధర పరిమాణాన్ని వివరంగా వెల్లడించింది. వాటి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ఎంజి ప్రొడక్ట్స్ లో ఒకటైన గ్లోస్టర్‌పై అధికంగా రూ.50,000 వరకు ధర పెరిగింది, దాని తర్వాత ZS EVపై రూ.45,000 వరకు ధరలో మార్పులు కానున్నాయి. అదే విధంగా, ఇదే లైన్ లో ఉన్న హెక్టర్ రేంజ్ పై రూ.40,000 వరకు ధరలు పెరగనున్నాయి.
ఇంకా చెప్పాలంటే, ఇక నుంచి ఎంజి ఆస్టర్ కూడా మరింత ప్రియంకానుంది, దీనిపై రూ. 25,000 వరకు ధరలు పెరగనున్నాయి. అదే విధంగా, కంపెనీ ద్వారా అత్యంత సరసమైన ధరకు లభించే ఎంజి కామెట్ ఈవీపై సుమారు రూ. 15,000 వరకు ధరలు పెరగనున్నాయి. కేవలం ఎంజి కార్ల కంపెనీ మాత్రమే కాకుండా ఇతర కార్ల కంపెనీలు మారుతి సుజుకి, హ్యుందాయ్, మెర్సిడెస్-బెంజ్, మహీంద్రా, స్కోడా, సిట్రోన్ మరియు టాటా మోటార్స్ కూడా జనవరి 2024 నుండి తమ మోడల్స్ పై ధరలను పెంచనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్