- తక్షణమే అమలులోకి వచ్చిన పెరిగిన ధరలు
- రూ.9.98 లక్షల నుంచి రూ.18.35 లక్షల మధ్య ఉన్న ఆస్టర్ రేంజ్ ధరలు
ఇండియాలో ఆస్టర్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ ధరలను తక్షణమే పెంచుతున్నట్లు జెఎస్‍డబ్లూ-ఎంజి మోటార్ ఇండియా ప్రకటించింది. పెరిగిన ధరలు హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతున్న ఈ మోడల్ లోని సెలెక్టెడ్ వేరియంట్లపై వర్తిస్తాయి. ప్రస్తుతం విక్రయించబడుతున్న ధరతో పోలిస్తే దీని ధరలు రూ.27 వేల వరకు పెరిగాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఏయే వేరియంట్ పై పెరిగిన ధరలు వర్తిస్తాయో ఓసారి తెలుసుకుందాం.
ఆస్టర్ మోడల్ లోని సావీ ప్రో టర్బో 1.3 ఎటి సంగ్రియా రెడ్, సావీ ప్రో 1.5 సివిటి సంగ్రియా రెడ్, మరియు సావీ ప్రో 1.5 సివిటి ఐవరీ వెర్షన్లపై రూ.27 వేల వరకు ధరలు పెరిగాయి. అలాగే, షార్ప్ ప్రో 1.5 సివిటి ఐవరీ, షార్ప్ ప్రో 1.5 ఎంటి ఐవరీ, మరియు సెలెక్ట్ 1.5 సివిటి ఐవరీ వెర్షన్లపై వరుసగా రూ.26 వేలు, రూ.24 వేలు, మరియు రూ.21 వేలు వరకు ధరలు పెరిగాయి.
అదే విధంగా, కస్టమర్లు ఎవరైతే షైన్ 1.5 ఎంటి ఐవరీ మరియు సెలెక్ట్ 1.5 ఎంటి ఐవరీ వెర్షన్లను చేయాలనుకుంటున్నారో వాటిపై కూడా రూ.20 వేల వరకు ధరలు పెరిగాయి. ఎంజి మోడల్ లోని అన్నీ ఇతర వెర్షన్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు ఈ మోడల్ రేంజ్ లో వెర్షన్ల ఎక్స్-షోరూం ధరలు రూ.9.98 లక్షల నుంచి రూ.18.35 లక్షల వరకు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్