- రూ. 9.98 లక్షలతో ప్రారంభమైన ఆస్టర్ ధరలు
- 5 వేరియంట్లలో లభ్యం
ఎంజి మోటార్ ఇండియా తాజాగా దాని మోడల్ రేంజ్ లో ఉన్న అన్ని కార్లపై ధరలను పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటి నుంచే అమలులోకి రానున్నాయి. కామెట్ ఈవీకి సంబంధించిన రివైజ్డ్ మరియు అప్డేటెడ్ ధరలు మా కార్వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి, మా వెబ్ సైట్ ని సందర్శించి, వాటి వివరాలు మీరు చూడవచ్చు.
ఇక ఆస్టర్ విషయానికి వస్తే, క్రెటా మరియు సెల్టోస్ తో పోటీపడుతున్న ఈ మిడ్-సైజ్ ఎస్యూవీలోని కొన్ని సెలెక్ట్ వేరియంట్లపై ఒకే విధంగా రూ.20 వేల వరకు ధర పెరిగింది. పెరిగిన ధర షార్ప్ ప్రో 1.5 ఎంటి ఐవరీ, షార్ప్ ప్రో 1.5 సివిటి ఐవరీ, సావీ ప్రో 1.5 సివిటి ఐవరీ, మరియు సావీ ప్రో 1.5 సివిటి సంగ్రియా అనే వేరియంట్లపై వర్తిస్తుంది. ఇంకా ఈ మోడల్ ఎంట్రీ-లెవెల్ మరియు టాప్-ఎండ్ వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోగా, ప్రస్తుతం ఆస్టర్ ధర రూ. 9.98 లక్షల నుండి రూ. 17.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) వరకు కొనసాగుతుంది.
ప్రస్తుతం, ఎంజి ఆస్టర్ స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, మరియు సావీ ప్రో అనే 5 వేరియంట్లలో అందించబడుతుంది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని స్టారీ బ్లాక్, క్యాండీ వైట్, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, హవానా గ్రే, స్టారీ బ్లాక్ రూఫ్ తో క్యాండీ వైట్ వంటి కలర్స్ నుండి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్