- భారీ అప్ డేట్లతో కొత్తగా కనిపిస్తున్న ఎంజి ఆస్టర్ కారు ఫ్రంట్ ఫాసియా
- ఆల్-బ్లాక్ థీమ్ తో వచ్చిన అప్ డేటెడ్ క్యాబిన్
త్వరలోనే ఎంజి ఇండియా ఆస్టర్ ఫేస్‍లిఫ్ట్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. దాని కంటే ముందుగా ఎంజి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకముందే, ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీకి చెందిన ఎక్స్‌టీరియర్ డిజైన్ తో పాటుగా మరియు ఇంటీరియర్లో చోటుచేసుకున్న మార్పుల వివరాలు లీక్ అయ్యాయి.
ఫోటోలలో చూసిన విధంగా, అప్ డేటెడ్ ఎంజి ఆస్టర్ కొత్త కలర్ ని పొందనుంది. ఇంకా ఇందులోని ఇతర హైలైట్లలో డీఆర్ఎల్స్ తో కూడిన స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ద్వారా మోడల్ కొత్త లుక్ ని పొందగా, డైమండ్ డిజైన్ తో రీడిజైన్డ్ గ్రిల్, భారీ ఎయిర్ డ్యాంతో అగ్రెసివ్ బంపర్, ఫ్రంట్ కెమెరా, మరియు కారు ముందు భాగంలో బ్లూ యాక్సెంట్స్ వంటివి ఉన్నాయి.
ఫోటోలలో చూసిన విధంగా, అప్ డేటెడ్ ఎంజి ఆస్టర్ కొత్త కలర్ ని పొందనుంది. ఇంకా ఇందులోని ఇతర హైలైట్లలో డీఆర్ఎల్స్ తో కూడిన స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ద్వారా మోడల్ కొత్త లుక్ ని పొందగా, డైమండ్ డిజైన్ తో రీడిజైన్డ్ గ్రిల్, భారీ ఎయిర్ డ్యాంతో అగ్రెసివ్ బంపర్, ఫ్రంట్ కెమెరా, మరియు కారు ముందు భాగంలో బ్లూ యాక్సెంట్స్ వంటివి ఉన్నాయి.
ఇంకా కారు వెనుక భాగం గురించి చెప్పాలంటే, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, బంపర్ పై సిల్వర్ గార్నిష్, వాషర్ తో కూడిన రియర్ వైపర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటికి మార్పులు పరిమితం చేయబడ్డాయి.
స్పై ఫోటోలలో చూస్తే, భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ని ప్రదర్శించే రివైజ్డ్ డ్యాష్ బోర్డు, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు కంట్రోల్స్ తో స్టీరింగ్ వీల్ వంటివి ఆల్-బ్లాక్ థీమ్ ద్వారా ఇంటీరియర్ కి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో అతి పెద్ద మార్పు ఏంటి అంటే, లోపలి భాగంలో అతి చిన్న గేర్ సెలెక్టర్ లీవర్ తో కొత్త సెంటర్ కన్సోల్ ని పొందడం, అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మరియు వైర్ లెస్ చార్జర్ వంటివి కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఆస్టర్ ఫేస్‍లిఫ్ట్ కారుకు సంబంధించిన పవర్ ట్రెయిన్ వివరాలు అందుబాటులో లేనప్పటికీ, కొత్త మరియు అప్ డేటెడ్ ఆస్టర్ హైబ్రిడ్ టెక్ తో జత చేయబడి మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు పెర్ఫార్మెన్స్ అందించడానికి ఒకేరకమైన ఇంజిన్ ఆప్షన్లతో కొనసాగవచ్చని భావిస్తున్నాం.
లాంచ్ అయిన తర్వాత, ఎంజి ఆస్టర్ ఫేస్‍లిఫ్ట్ కారు మిడ్-సైజ్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు హోండా ఎలివేట్ వంటి కార్లతో పోటీని కొనసాగించనుంది.
మూలం: ఎంఆర్డీ కార్స్
అనువాదించిన వారు: సంజయ్ కుమార్