- బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
- మాక్సిమమ్ 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న మోడల్
మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూ. 2.25 కోట్ల ధరతో ఇండియన్ మార్కెట్ లోనేడే లాంచ్ చేసింది. EQS 680 అనేది ప్యూర్ -ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ కాగా, ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది.
స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఇది భారీ గ్రిల్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌ల్యాంప్స్ తో మేబ్యాక్-స్పెసిఫిక్అంశాలు మరియు ఫీచర్లను కలిగి ఉంది. గ్లోబల్-స్పెక్ వలె, ఇది లగ్జరీ మరియు సౌకర్యాన్ని అందించే మరిన్ని ఫీచర్లు కూడా పొందింది. ఇందులో 15-స్పీకర్ బర్మెస్టర్ 4D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, నప్పా లెదర్ సీట్స్, (రియర్)వెనుక వైపు ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్, పవర్డ్ కర్టెన్స్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అలాగే కస్టమర్‌లు దీనిని వెనుకవైపు ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్ మరియు షాంపైన్ ఫ్లూట్ గ్లాసెస్‌తో కూడిన రిఫ్రిజిరేటర్‌తో కూడా ఎంచుకోవచ్చు.
సేఫ్టీ ఫీచర్ల పరంగా చూస్తే, లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 360-డిగ్రీ కెమెరా, వివిధ ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి మరిన్నింటిని పొందుతుంది. ఇది ఎకో, స్పోర్ట్, ఆఫ్‌రోడ్, ఇండివిజువల్ మరియు మేబాక్ మోడ్‌ల వంటి వివిధ డ్రైవ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.
పవర్‌ట్రెయిన్
షాంఘై ఆటో షోలో మొదటిసారిగా ఒకేఒక్క 680 వేరియంట్‌తో ఆవిష్కరించబడగా, EQS 680 అనే లగ్జరీ కారు 107.8 kWh బ్యాటరీ ప్యాక్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడింది. ఇది ఆల్-వీల్-డ్రైవ్ కారుగా మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ బ్యాటరీ-ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ 649bhp మరియు 950Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4సెకన్లలో 0-100కెఎంపిహెచ్ స్ప్రింట్ చేయగలదు, అదే విధంగా, ఈ మోడల్ ని, ఒక్కసారి ఒక పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 600కిలోమీటర్ల వరకు డబ్ల్యూఎల్‍టిపి -క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప