- పెట్రోల్ మరియు డీజిల్ రకాలలో మరియు 3 వేరియంట్లలో వచ్చిన జీఎల్ఏ ఫేస్‍లిఫ్ట్
- 3.0-లీటర్ గ్యాసోలిన్ మోటారుతో కొనసాగుతున్న జీఎల్ఈ 53 ఎఎంజి
మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొత్తానికి మెర్సిడెస్ జీఎల్ఏ మరియు ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్స్ ని లాంచ్ చేసింది. మెర్సిడెస్ జీఎల్ఏ ప్రారంభ ధర రూ. 50.50 లక్షలు ఉండగా, మెర్సిడెస్ఎఎంజి జీఎల్ఈ 53 ప్రారంభ ధర రూ.1.85 కోట్లు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) ఉంది. దీనికి అదనంగా, ఈ ఆటోమేకర్ ఐకానిక్ జి-వ్యాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ని కూడా ప్రదర్శించింది.
మెర్సిడెస్ జీఎల్ఏ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్
ఇది మొత్తం 200, 220d 4మాటిక్, మరియు 220d 4మాటిక్ఎఎంజి అనే 3 వేరియంట్లలో లభిస్తుంది. 2024 జీఎల్ఏ కొత్త ఫ్రంట్ ఫాసియా, ట్వీక్డ్ బంపర్స్, లేటెస్ట్ గా డిజైన్ చేసిన ఎల్ఈడీహెడ్ల్యాంప్స్, అప్‍డేటెడ్ ఎంబియుఎక్స్ఇంటర్‌ఫేస్ మరియు కొత్త 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో మిడ్-లైఫ్ అప్‍డేట్స్ పొందింది. మెకానికల్ గా, అప్‍డేటెడ్ జీఎల్ఏ యొక్క 1.3 గ్యాసోలిన్ మోటార్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను వరుసగా 7-స్పీడ్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, జీఎల్ఏ 200 వేరియంట్కేవలం 8.9 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ స్పీడ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది లీటరుకు 17.4 ఏఆర్ఏఐ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. ఇక జీఎల్ఏ220d 4మాటిక్ విషయానికి వస్తే, ఇది కేవలం 7.5 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది లీటరుకు 18.9 ఏఆర్ఏఐ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది.
మెర్సిడెస్ ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్
మరోవైపు, స్పోర్ట్స్ ఎస్‍యూవీ అయిన మెర్సిడెస్ ఎఎంజి జీఎల్ఈ 53 కూపే ఫేస్‍లిఫ్ట్ కేవలం సింగిల్ వేరియంట్ తో అందించబడింది. దీని 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టంతో జతచేయబడి 429bhp పవర్మరియు 560Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ నిర్వహించబడుతుండగా, ఇది బ్రాండ్ 4మాటిక్ సిస్టం ద్వారా 4-వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు కాగా, ఇది కేవలం 5 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ స్పీడ్ వేగాన్ని అందుకుంటుంది.
వేరియంట్-వారీగా కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ ధరలు కింది విధంగా ఉన్నాయి:
మోడల్ మరియు వేరియంట్ | ఎక్స్-షోరూం ధరలు |
జీఎల్ఏ 200 | రూ. 50.50 లక్షలు |
జీఎల్ఏ 220d 4మాటిక్ | రూ. 54.75 లక్షలు |
జీఎల్ఏ 220d 4మాటిక్ ఎఎంజి లైన్ | రూ. 56.90 లక్షలు |
ఎఎంజి జీఎల్ఈ 53 కూపే | రూ. 1.85 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్