- ఎఎంజి లైన్ వేరియంట్లో పూర్తి GLE రేంజ్ మోడల్స్ లభ్యం
- 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చిన కొత్త వేరియంట్
మెర్సిడెస్ బెంజ్ GLE300d వేరియంట్లో ఎఎంజి లైన్ ని రూ. రూ.97.85 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త లాంచ్ ద్వారా, GLE 300d స్టాండర్డ్ వెర్షన్ స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. అలాగే, GLE రేంజ్ లోని మోడల్స్ అన్ని ఇప్పుడు ఎఎంజి లైన్ కిట్ తో అందించబడతాయి.
ప్రస్తుతం విక్రయించబడుతున్న ఎడిషన్ తో పోలిస్తే, కొత్త GLE 300dఎఎంజి లైన్ వివిధ ఫీచర్ల మార్పులతో రాగా, అందులో ట్రెమోలైట్ గ్రే కలర్ పెయింటింగ్ తో 20-ఇంచ్ ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, పెద్ద బ్రేకులు, కొత్త డైమండ్ గ్రిల్ డిజైన్, ట్వీక్డ్ ఫాసియా మరియు బాడీ-కలర్డ్ ఫ్రంట్ మరియు రియర్ వింగ్ ఫ్లేర్స్ వంటివి ఉన్నాయి. కారు లోపల,లేటెస్టు ఎంబియుఎక్స్సిస్టమ్ మరియు 13-స్పీకర్ బర్మెస్టర్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వచ్చింది.
కారులో అన్నింటి కంటే ముఖ్య భాగమైన ఇంజిన్ విషయానికి వస్తే, 2024మెర్సిడెస్ బెంజ్ GLE300dఎఎంజి లైన్ కారు 269bhp పవర్ మరియు 550Nm టార్కు ఉత్పత్తి చేసే 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే, ఇందులో ఐఎస్‍జి టెక్నాలజీతో మైల్-హైబ్రిడ్ సిస్టం అందించబడగా, ఇంజిన్ ని బూస్ట్ చేస్తూ అదనంగా 20bhp పవర్ మరియు 220Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో వీల్స్ కి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కి పవర్ సప్లై చేయబడుతుంది. దీంతో, ఈ కారు కేవలం 6.9 సెకన్లలోనే జీరో నుంచి 100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్