- ఒకేఒక్క ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
- సింగిల్ ఫుల్ ఛార్జ్ తో 546 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ దీని సొంతం
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ దాని మరొక కొత్త ఎలక్ట్రిక్ మోడల్ ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త EQS ఎస్‍యూవీ అనే ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు ఇండియాలో 1.46 కోట్ల ఎక్స్-షోరూం ధరతో ప్రారంభమయ్యాయి. ఈ నెల ప్రారంభంలో మేబాక్ EQS ఎస్‍యూవీ లాంచ్ కాగా, దాని తర్వాత ఈ కొత్త మోడల్ అందించబడింది.
కొత్త EQS ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో అందించబడిన రెండు మోటార్లు 122kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ తో జతచేయబడి, 536bhp మరియు 858Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఫుల్ ఛార్జ్ తో ఈ మోడల్ 809 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని మెర్సిడెస్ కంపెనీ పేర్కొంది.
2024 EQS ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, డ్యూయల్-టోన్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు ఫ్రంట్ క్వార్టర్ గ్లాస్ పై EQS బ్యాడ్జింగ్ వంటి వాటిని కలిగి ఉంది.
సాధారణంగా లగ్జరీ కార్లు అంటే, బెస్ట్ డిజైన్ మాత్రమే కాకుండా బెస్ట్ ఇంటీరియర్ ఫీచర్లను కూడా కస్టమర్లు కోరుకుంటారు. కస్టమర్ల అంచనాలకు తగ్గట్లుగా ఈ కారు ఆప్షనల్ MBUX హైపర్ స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఫ్రీస్టాండింగ్ 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్ ప్లే, లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్, మరియు 17.7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి ఫీచర్లతో వచ్చింది. అలాగే, ఈ కారు ప్రత్యేకంగా కనిపించడానికి సాఫ్ట్-క్లోజ్ డోర్స్ తో అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్