- కేవలం సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చిన కొత్త EQA ఈవీ మోడల్
- సింగిల్ ఛార్జ్ తో 560 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని పేర్కొన్న బ్రాండ్
లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్-బెంజ్ అత్యంత చవక ధరలో EQA అనే ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని రూ. 66 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. GLA ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ గా వస్తున్న ఈ మోడల్ ని EQA 250+ గా పిలుస్తుండగా, ఇది కేవలం సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో మాత్రమే అందించబడింది.
ఇంకా కారు ముందు భాగంలో ఉన్న డిజైన్ గురించి చెప్పాలంటే,కొత్త EQA మోడల్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీలైట్ బార్స్, త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కొత్త గ్రిల్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో వచ్చింది. ఇంకా మీరు దీనిని ఏడు కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.అవి ఏంటి అంటే, పోలార్ వైట్ హై-టెక్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, స్పెక్ట్రల్ బ్లూ, పెటగోనియా రెడ్ మరియు మౌంటైన్ గ్రే మాగ్నో.
ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే, మెర్సిడెస్ EQA 360-డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్ ప్లే, జెస్చర్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ టెయిల్‌గేట్, 4 డ్రైవ్ మోడ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, రెండు 10.25-ఇంచ్ స్క్రీన్స్ మరియు 7 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లతో వచ్చింది.
2024 EQA మోడల్ లోని అందించబడిన 70.5kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది, దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 560 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుందని మెర్సిడెజ్-బెంజ్ కంపెనీ పేర్కొంది. అదే విధంగా ఈ కారు 188bhp పవర్ మరియు 385Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కొత్త EQA మోడల్ ని 11kW ఏసీ ఛార్జర్ సహాయంతో ఏడు గంటల 15 నిమిషాల్లో 0-100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే, 100kW డిసి ఛార్జర్ ని ఉపయోగించి కేవలం 35 నిమిషాలలో EQA ఈవీని 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇండియాలో, EQA ఈవీ మోడల్ బిఎండబ్లూ iX1 మరియు వోల్వో XC40 రీఛార్జ్ వంటి లగ్జరీ కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్