- పవర్డ్ 4.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్
- రూ.5.91 కోట్ల ధరతో లాంచ్ అయిన 750S మోడల్
బ్రిటిష్ సూపర్ కార్ మేకర్ మెక్ లారెన్ తన మోస్ట్ పవర్ ఫుల్ 750Sమోడల్ ను ఇండియాలో రూ. 5.91 కోట్లు(ఎక్స్-షోరూం) ధరతో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఏప్రిల్ 2023లో ఆవిష్కరించగా, 720S విజయవంతం కావడంతో మెక్ లారెన్ 750Sని తీసుకువచ్చింది. ఇది కూపే మరియు హార్డ్ టాప్ కన్వర్టిబుల్ బాడీ స్టైల్స్ లో విక్రయించబడనుంది.
డిజైన్ మరియు స్టైలింగ్ గురించి చెప్పాలంటే, 750S లుక్స్ అచ్చం 720S లాగే ఉన్నాయి. ఇందులో డీఆర్ఎల్స్ తో కూడిన రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, భారీగా కనిపించే స్ప్లిట్ ఎయిర్ డ్యామ్స్, కొత్త వీల్ ఆర్చ్ వెంట్స్, పొడవైన రియర్ డెక్, మరియు వెనుక భాగంలో భారీ మొత్తంలో యాక్టివ్ వింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మీరు కారు లోపలికి వెళ్లి చూస్తే, డ్యాష్ బోర్డ్ మరియు ఇంటీరియర్ పూర్తిగా నప్పా లెదర్ తో చుట్టబడి ఉంది. అలాగే ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వర్టికల్ గా అమర్చబడి ఉన్న 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, మరియు బోవర్స్ మరియు విల్కిన్స్-సోర్స్డ్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ మెక్ లారెన్ 750Sలో ఉన్నాయి.
ఈ కారులో ముఖ్య భాగమైన ఇంజిన్ గురించి చెప్పాలంటే, 740bhp పవర్మరియు 800Nm టార్కును ఉత్పత్తి చేయడానికి వీలుగా మెక్ లారెన్ 750S యొక్క 4.0-లీటర్, ట్విన్-టర్బో, V8 గ్యాసోలిన్ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జత చేయబడింది. ముఖ్యంగా, ఈ సూపర్ కార్ కేవలం 2.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడమే కాక, గంటకు 331 కిలోమీటర్ల దూరాన్ని ఈజీగా చేరుకోగలదు. మెక్ లారెన్ బ్రాండ్ నుంచి వచ్చిన మోస్ట్ పవర్ ఫుల్ ప్రొడక్షన్ కారు ఇదే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, మెక్ లారెన్ కేవలం 750Sయొక్క పవర్ పై మాత్రమే ఫోకస్ చేయకుండా 720Sతో పోలిస్తే 30కిలోల బరువును కూడా తగ్గించింది. దీంతో పెర్ఫార్మెన్స్ పరంగా ఇది మరింత అద్బుతంగా ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్