- మూడు వేరియంట్లలో లభ్యం
- ఇండియాకు కంప్లీట్ బిల్ట్ యూనిట్ గా వచ్చిన ఖరీదైన లగ్జరీ కారు
లగ్జరీ కార్ల కంపెనీ మసెరటి దాని నయా మోడల్ గ్రెకాలె ఎస్‍యూవీ అనే ఖరీదైన కారును ఇండియాలో రూ.1.31 కోట్ల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది మొత్తం మూడు వేరు వేరు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. గ్రెకాలె జిటి అనే వెర్షన్ ఫోర్-సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ తో రాగా, ఇది 300hp ని ఉత్పత్తి చేస్తుంది. గ్రెకాలె మోడెనా అనే వెర్షన్ ఫోర్ సిలిండర్ 330-hp మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ తో మరియు హై-పెర్ఫార్మెన్స్ ట్రోఫియో అనే వెర్షన్ 530-hp V6 ఇంజిన్ తో వచ్చింది. ఇందులో, మోస్ట్ పవర్ ఫుల్ ట్రోఫియో వెర్షన్ మోడల్ 3.8 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుండగా, 285కెఎంపిహెచ్ టాప్ స్పీడ్ ని కూడా అందిస్తుంది.
ఫీచర్ లిస్టులో ఉన్న అతి పెద్ద హైలైట్లలో మసెరటి ఇంటెల్లిజెంట్ అసిస్టెంట్ (ఎంఐఎ) మల్టీమీడియా సిస్టం, లేటెస్ట్ ఇన్ఫోటైన్మెంట్, కంఫర్ట్ డిస్ ప్లే, డిజిటల్ క్లాక్, మరియు హెడ్స్-అప్ డిస్ ప్లే ఒక ఆప్షన్ గా అందుబాటులో ఉంది. అంతే కాకుండా, ఆస్వాదించేందుకు మసెరటి ఇంజిన్ సోనస్ ఫాబెర్ మల్టీ-డైమెన్షనల్ సౌండ్ సిస్టమ్ తో జత చేయబడి ఐకానిక్ సిగ్నేచర్ సౌండ్ ద్వారా ఆల్ రౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ని మీకు ఖచ్చితంగా అందిస్తుంది.
భవిష్యత్తులో, మసెరటి కంపెనీ ఇండియాలో గ్రెకాలె రేంజ్ లోకి ఫుల్-ఎలక్ట్రిక్ వెర్షన్ ని తీసుకురానుంది, దీని ద్వారా మసెరటి హిస్టరీలో 400V టెక్నాలజీ సహాయంతో వచ్చే మొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇదే అవుతుంది. దీని ద్వారా అర్థం అవుతుంది ఏంటి అంటే, బ్రాండ్ ఈ లగ్జరీ కారుతో కొత్త ఎలక్ట్రిఫికేషన్ యుగంలో కొత్త చాప్టర్ ని ప్రారంభిస్తుంది.
గ్రెకాలె లాంచ్ తో పాటుగా మరిన్ని అంశాల గురించి చెప్పాలంటే, మసెరటి కార్ల సంస్థ న్యూ ఢిల్లీ మరియు బెంగుళూరు ఏరియాల్లో కొత్త డీలర్ షిప్స్ ప్రారంభించడం ద్వారా ఇండియాలో దాని మార్కెట్ ని పెంచుకుంటుంది. ఇది వరకే ముంబైలో డీలర్ ఉండగా, దీనికి తోడుగా ఇప్పుడు న్యూ ఢిల్లీలో మసెరటి నార్త్ ఇండియా మరియు బెంగుళూరులో విఎస్‍టి మసెరటి అనే డీలర్ షిప్స్ ని ప్రారంభించింది.
మసెరటి గ్రెకాలె ధరలు (ఎక్స్-షోరూం)
మసెరటి గ్రెకాలె జిటి – రూ.1.31 కోట్లు
మసెరటి గ్రెకాలె మోడెనా - రూ.1.53కోట్లు
మసెరటి గ్రెకాలె ట్రోఫియో - రూ.2.05 కోట్లు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్