- రెండు వేరియంట్లలో అందించబడిన కొత్త మోడల్
- సెకండ్-జెన్ మోడల్ గా వచ్చిన టూ-డోర్ స్పోర్ట్స్ సెడాన్
ఇటాలియన్ లగ్జరీ కార్ మేకర్మసెరటి ఇండియాలోసెకండ్ జనరేషన్ గ్రాన్‌టూరిస్మోను లాంచ్ చేసింది.టూ-డోర్ స్పోర్ట్స్ సెడాన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.అవి ఏంటి అంటే, మోడెనా మరియు ట్రోఫియో. వీటి ఎక్స్-షోరూం ధరలు వరుసగా రూ.2.72 కోట్లు మరియు రూ.2.90 కోట్లుగా ఉన్నాయి. గ్రాన్‌టూరిస్మో నయా ఇటరేషన్ప్రస్తుతం పెట్రోల్-వెర్షన్లోమాత్రమే అందించబడుతోంది.అయితే, ఆల్-ఎలక్ట్రిక్ ఫోల్గోర్ వెర్షన్ 2025లో అరంగేట్రం చేయడానికి షెడ్యూల్ చేయబడింది.
డిజైన్ పరంగా చూస్తే, లేటెస్ట్గ్రాన్‌టూరిస్మోదాని ముందున్న మోడల్ లో అందించబడిన డిజైన్ అంశాలు మరియు సిల్హౌట్ చాలా వరకు అలానే ఉన్నాయి.ఎక్స్‌టీరియర్ డిజైన్ లోడీఆర్ఎల్స్ తో నిలువుగా అమర్చబడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పొడవాటిముక్కు ఆకారంలో బానెట్, మసెరటి లోగోతో కూడిన ఓవల్-షేప్ లో తక్కువ ఎత్త్తులో అమర్చబడిన గ్రిల్, ఫంక్షనల్ ఎయిర్ కర్టైన్స్, మల్టీ-స్పోక్ హై-ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్వంటివి ఉన్నాయి.
ఫీచర్ల పరంగా, గ్రాన్‌టూరిస్మో12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు క్లైమేట్ కంట్రోల్ మరియు సీట్ ఫంక్షన్‌లకు డెడికేట్ చేయబడిన సెంటర్ కన్సోల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చింది.
మెకానికల్ గా, గ్రాన్‌టూరిస్మో అనే లగ్జరీ కారులోని రెండు వేరియంట్లు 3.0-లీటర్ V6 ఇంజన్‌తో వచ్చాయి.అయితే, మోడెనా వెర్షన్ 490bhp మరియు 600Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.మరోవైపు, ట్రోఫియోలోని మోటార్ 550bhp మరియు 650Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రేంజ్ లోని అన్ని వేరియంట్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్