- అందులో సగానికి పైగా ఉన్న సిఎన్‍జి వెర్షన్ కార్లు
- త్వరలో సుజుకి స్విఫ్ట్ సిఎన్‍జి లాంచ్
ఆటోమొబైల్ మార్కెట్ ప్రస్తుతం క్షీణిస్తున్న తరుణంలో, మారుతూ సుజుకి కంపెనీ దాని మోడల్ రేంజ్ లో ఉన్న వివిధ మోడల్స్ ద్వారా రికార్డు స్థాయిలో ఎన్నో ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఆ సంఖ్య ఎంతో తెలిస్తే షాక్ కి గురికాక తప్పదు. ఎందుకంటే, సెప్టెంబర్-2024 నాటికి కార్ మేకర్ దేశవ్యాప్తంగా ఒక లక్షా 60 వేల కార్లను డెలివరీ చేయాలి. వీటన్నింటిని డెలివరీ చేయాలంటే మారుతి సుజుకి కంపెనీకి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలని ఉంటే కింద అందించిన సమాచారాన్ని చదివి తెలుసుకోండి.
మొత్తంగా 1.65 లక్షల కార్లను మారుతి డెలివరీ చేయాల్సి ఉండగా, అందులో 40 శాతం వరకు సిఎన్‍జి వెర్షన్ కార్లే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే, మారుతి సుజుకి సిఎన్‍జి వెర్షన్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే, బ్రెజా, ఎర్టిగా, మరియు డిజైర్ వంటి కార్లు మారుతి బ్రాండ్ నుంచి బెస్ట్ సెల్లింగ్ సిఎన్‍జి కార్లుగా చెలామణి అవుతున్నాయి. ముఖ్యంగా, మారుతి కంపెనీ దాని ప్రణాళికలలో భాగంగా, ఈ వారం చివరలో కొత్త స్విఫ్ట్ రేంజ్ లో సిఎన్‍జి ఆప్షన్ ని పరిచయం చేయనుంది అనే అప్ డేట్ ని అందించింది.
అదే విధంగా, మారుతి కంపెనీ ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, సెలెరియో వంటి కార్లలో డ్రీమ్ సిరీస్ రేంజ్ ని తీసుకువచ్చి దాని సేల్స్ ని మరింతగా విస్తరించింది. ఈ స్పెషల్ ఎడిషన్లు కేవలం తక్కువ మరియు ఎక్స్‌క్లూజివ్ ధరతో మాత్రమే కాకుండా, స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే మరిన్ని అదనపు ఫీచర్లతో వచ్చాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్