- 3 వేరియంట్లలో అందించబడుతున్న మోడల్
- వివిధ ఫీచర్స్ మరియు కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందిన కారు
మారుతి సుజుకి దాని వ్యాగన్ R రేంజ్ లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను ఈరోజే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ధర రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభం కాగా, దీనిని వ్యాగన్ R వాల్జ్ లిమిటెడ్ ఎడిషన్ అని పిలుస్తారు. అలాగే, స్టాండర్డ్ కారు కంటే, ఈ కొత్త వెర్షన్ మరిన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్ మరియు వివిధ ఫీచర్లను పొందింది.
స్టాండర్డ్ వ్యాగన్ R తో పోలిస్తే, కొత్త వాల్జ్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఫాగ్ లైట్స్ , వీల్ ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్స్, ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, ఫాగ్ లైట్ గార్నిష్, సైడ్ స్కర్ట్స్ మరియు బాడీ సైడ్ మౌల్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో చూస్తే, కొత్త వెర్షన్ కొత్త ఫ్లోర్ మ్యాట్స్ , స్టైలింగ్ కిట్, 6.2-ఇంచ్ టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందింది. అంతేకాకుండా, సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, ఈ మోడల్ లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే, మారుతి వ్యాగన్ R వాల్జ్ లిమిటెడ్ ఎడిషన్ Lxi, VXi మరియు ZXi అనే 3 వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్ మరియు (మారుతి స్పీక్‌లో AGS) ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడిన 1.0-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఈ కారులో సిఎన్‍జి ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప