- ఇండియాలో రూ.5.99 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమైన ధరలు
- పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో అందించబడుతున్న స్విఫ్ట్ మోడల్
మారుతి సుజుకి దాని పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన స్విఫ్ట్‌తో పాటుగా మొత్తం పోర్ట్‌ఫోలియో ఎక్స్-షోరూమ్ ధరలను పెంచింది. ఈ పెరిగిన ధరలు 16 జనవరి, 2024 నుండే అమలులో ఉన్నాయి. స్విఫ్ట్ యొక్క సెలెక్టెడ్ వేరియంట్‌లపై రూ. 5,000 వరకు ధరలు పెరిగాయి. దీంతో, స్విఫ్ట్కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలతో ప్రారంభమైంది.
ప్రస్తుతం, మారుతి సుజుకి స్విఫ్ట్ ని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో LXi, VXi, ZXi, మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో అందిస్తుంది. VXi, ZXi, VXi సిఎన్‍జి, ZXi ప్లస్, ZXi ప్లస్ డ్యూయల్-టోన్, మరియు ZXi సిఎన్‍జి వేరియంట్లపై ఒకే విధంగా రూ. 5,000 పెరగగా, మిగతా అన్నీ వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు.
హుడ్ కింద, స్విఫ్ట్ యొక్క 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 89bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి మోడ్ లో, అదే మోటార్ 76bhp పవర్ మరియు 98Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
వేరియంట్ వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
LXi | రూ. 5,99,450 |
VXi | రూ. 7,00,000 |
VXi ఎఎంటి | రూ. 7,50,000 |
ZXi | రూ. 7,68,000 |
VXi సిఎన్‍జి | రూ. 7,90,000 |
ZXi ఎఎంటి | రూ. 8,18,000 |
ZXi ప్లస్ | రూ. 8,39,000 |
ZXi ప్లస్ డ్యూయల్-టోన్ | రూ. 8,53,000 |
ZXi సిఎన్‍జి | రూ. 8,58,000 |
ZXi ప్లస్ ఎఎంటి | రూ. 8,89,000 |
ZXi ప్లస్ ఎఎంటి డ్యూయల్-టోన్ | Rs. 9,03,000 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్