- 3 వేరియంట్లలో లభ్యం
- 32.85లోమీటర్లు/కిలో క్లెయిమ్డ్ మైలేజ్ ని అందిస్తున్న మోడల్
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ సిఎన్‍జి వెర్షన్‌ను నేడే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది, దీనిని మీరు రూ. 8.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. అలాగే, కస్టమర్‌లకు 2024 అక్టోబర్ 12వ తేదీ నుండి హ్యాచ్‌బ్యాక్ కొత్త ఇటరేషన్ డెలివరీ చేయబడుతుంది.
వేరియంట్‌ల పరంగా చూస్తే, కొత్త మారుతి స్విఫ్ట్ సిఎన్‍జి VXi, VXi(O), మరియు ZXi అనే 3 వేరియంట్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. 1.2-లీటర్, మూడు-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 80bhp మరియు 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి మోడ్‌లో, 69bhp మరియు 102Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు,ఇది 32.85లోమీటర్లు/కిలో మైలేజీని అందిస్తుందని మారుతి సుజుకి కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఇది మునుపటి- జనరేషన్ స్విఫ్ట్ సిఎన్‍జి కంటే 6 శాతం ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం బ్రాండ్ నుండి 14వ సిఎన్‍జి మోడల్ అయిన స్విఫ్ట్ కారు డిజైన్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, వీటిలో ఎటువంటి మార్పులు లేవు. అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న డిజైన్ హైలైట్‌లలో ఎల్‌ఈడీ ఫాగ్ లైట్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్,15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, ఓటీఎ అప్‌డేట్స్ తో పాటుగా మరిన్ని అంశాలు ఉన్నాయి. ఓ రకంగా సిఎన్‍జి కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ కారును బుక్ చేసుకుని మీ ఫ్యామిలీతో దసరా మరియు దీపావళి పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి.
స్విఫ్ట్ సిఎన్‍జి వేరియంట్ వారీగా (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ధరలు |
VXi సిఎన్‍జి | రూ. 8.19 లక్షలు |
VXi (O) సిఎన్‍జి | రూ. 8.46 లక్షలు |
ZXi సిఎన్‍జి | రూ. 9.19 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప