- ఇండియాలో రూ.5.99 లక్షల నుండి ప్రారంభంకానున్న స్విఫ్ట్ ధరలు
- తాజాగా న్యూ-జెన్ మోడల్ పై కొనసాగుతున్న టెస్టింగ్
దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్స్ అరీనా మరియు నెక్సా రేంజ్ లో తమ కొన్ని ప్రొడక్ట్స్ పై సంవత్సరాంతపు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనంవీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతి స్విఫ్ట్ ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకుదానిపై రూ.49,000 వరకుడిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000ఎక్స్చేంజ్ బోనస్, మరియు రూ.4,000 కార్పోరేట్ డిస్కౌంట్ కలిపి ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే, గత కొన్ని నెలల నుంచి లభిస్తున్న ఆఫర్లతో పోలిస్తే ప్రస్తుతం హ్యాచ్బ్యాక్పై డిస్కౌంట్ తగ్గింది.
ఇంతకు ముందు నుంచే ఇండియాలో మారుతి కంపెనీ న్యూ-జెన్ మోడల్ ని టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. దీని మాతృత్వ కంపెనీ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్, ఈ సంవత్సరం అక్టోబరులో 2023 జపాన్ మొబిలిటీ షోలో తన ఫోర్త్-జనరేషన్ మోడల్ ని ఆవిష్కరించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్