- నవంబర్ 2023 నాటికి చెల్లుబాటులో ఉన్న పెండింగ్ ఆర్డర్‌లు
- ఇటీవలి కాలంలో సరఫరా పూర్తిగా ట్రాక్షన్ పొందిన మారుతి
నవంబర్ 2023 నాటికి మరియు ఆర్ధిక సంవత్సరం 23-24కు సంబంధించి సుమారుగా 2.08 లక్షల యూనిట్ల ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని మారుతి సుజుకి వెల్లడించింది. గత నెలలో, కార్ మేకర్ మొత్తంలో 1.73 లక్షల యూనిట్లకు పైగా కార్లను తయారు చేయగా, వీటిలో మినీ మరియు కాంపాక్ట్ సబ్-కేటగిరీస్ లో ఏకంగా 1.04 లక్షలు యూనిట్లకు పైగా విక్రయించింది.
ఈ ఏడాది ఆగస్టులో, మారుతి సుజుకికి సంబంధించి దాదాపు 3.55 లక్షల వెహికల్స్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరొక వైపు, ఎర్టిగా 93,000 యూనిట్ల ఆర్డర్ బుకింగ్ లో మొదటి స్థానంలో నిలవగా, బ్రెజ్జా మరియు గ్రాండ్ విటారా వరుసగా 48,000 మరియు 27,000 ఆర్డర్‌లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
తరువాత సెప్టెంబర్ 2023లో, మారుతిసెమీకండక్టర్స్ మరియు సిఎన్‍జికు సంబంధించిన విభాగాలలో సరఫరా పెరుగుదలతో ఎర్టిగా, బ్రెజ్జా, స్విఫ్ట్ మరియు డిజైర్ వంటి కార్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది.ఈ ప్రయత్నం వల్ల ఎర్టిగా వెయిటింగ్ పీరియడ్ గత త్రైమాసికంలో ఉన్న దానికంటే సగానికి సగం తగ్గింది.
అనువాదించిన వారు: రాజపుష్ప