- వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని అంచనా
- ఇండియా యొక్క మొట్టమొదటి దేశీయ-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్
మారుతి సుజుకి భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024 స్టేజ్ పై వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ప్రదర్శించడానికి అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా, ఢిల్లీలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా కనిపించిన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వచ్చే ఏడాది చివర్లోలాంచ్ అవుతుందని అంచనా.
వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (ఎఫ్ఎఫ్) ఏదైనా ఇథనాల్-పెట్రోల్ మిశ్రమాన్ని ఫ్యూయల్ గా ఉపయోగించడానికి రీ-ఇంజనీరింగ్ చేయబడింది. ఇది టెయిల్‌పైప్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ తో పోలిస్తే ఇక్కడ ప్రదర్శించిన కార్ ఎక్స్‌టీరియర్ భాగంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ, 'ఫ్లెక్స్ -ఫ్యూయల్' లో ఇవి మిస్ అయ్యాయని అని చెప్పవచ్చు. దీని క్యాబిన్ కూడా ఏమాత్రం మెరుగుపరచకుండా ఇంతకు ముందు చూసిన కారు లాగే ఉండనుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, సాధారణమైన1.2-లీటర్నేచురల్లీ ఆస్పిరేటెడ్ఫోర్-సిలిండర్ ఇంజిన్ తో ఇది 88.5bhp మరియు 113Nm పవర్ ని అందిస్తుంది. ఇదిస్టాండర్డ్ గా 5-స్పీడ్ మాన్యువల్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ఆటోమేటిక్ వెర్షన్ ని కూడా పొందవచ్చని మేము భావిస్తున్నాము, ముఖ్యంగా చెప్పాలంటే, ఈ పవర్‌ట్రెయిన్ 20శాతం (E20) మరియు 85శాతం (E85) మధ్య ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో ఉండేలా తయారు చేయబడింది. దీనితో, వ్యాగన్ఆర్ (ఎఫ్ఎఫ్) పర్యావరణానికి 79శాతం వరకు అనుకూలంగా ఉండనుంది, అంతేకాకుండా, ఇది సాధారణమైన గ్యాసోలిన్-పవర్ తో నడిచే వ్యాగన్ ఆర్ వంటి అదే లెవెల్ పెర్ఫార్మెన్స్ అందించగలదని మేము భావిస్తున్నాము.
ఫ్లెక్స్ ఫ్యూయల్ మరింత మెరుగ్గా పనిచేయడానికి, స్ట్రాంగ్ ఫ్యూయల్ పంప్ మరియు ఇంజెక్టర్లను మినహాయించి పవర్‌ట్రెయిన్ యొక్క ఇథనాల్ శాతాన్ని కొలవడానికి ఇథనాల్ సెన్సార్స్, కోల్డ్ స్టార్ట్ అసిస్టెన్స్ కోసం హీటెడ్ ఫ్యూయల్ రైల్స్, అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో సహా మరికొన్ని మార్పులను పొందింది.
వ్యాగన్ఆర్ ఎఫ్ఎఫ్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్2025 నాటికి విక్రయించబడుతుందని మేముభావిస్తున్నాము. ఇది స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ కంటే కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు అంతేకాకుండా, ఇది ఇండియాలో మొట్టమొదటి దేశీయ-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అవుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప