- ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల పెరిగిన ధర
- ప్రస్తుతం ఇండియాలో 17మోడల్స్ ను విక్రయిస్తున్న మారుతి
ఇండియా యెక్క ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన మారుతీ సుజుకి జనవరి 2024 నుండి తమ వెహికల్స్ పై ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరగనున్నధరల పరిమాణాన్ని ఆటోమేకర్ వెల్లడించనప్పటికీ, పెరిగిన ధరల ఒత్తిడే దీని ధర పెరగడానికి కారణం. మొత్తం ధరల పెరుగుదల మరియు పెరిగిన వస్తువుల ధరలే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ పై ధరల పెంపుకు కారణంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం,ఈ బ్రాండ్ తన ఎరీనా మరియు నెక్సా అవుట్‌లెట్ల ద్వారా దేశం అంతటా 17 మోడళ్లను రిటైల్ చేస్తోంది. అవి: వ్యాగన్ ఆర్,సెలెరియో, s-ప్రెస్సో, స్విఫ్ట్, ఆల్టో, డిజైర్, బ్రెజా, ఎర్టిగా, ఈకో, బాలెనో, సియాజ్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, XL6, జిమ్నీ మరియు ఇటీవల విడుదలైన ఇన్విక్టో.
మరో వార్తలో చూస్తే, మారుతి సుజుకి పైప్‌లైన్‌లో ప్రస్తుతం రాబోయే సంవత్సరాల్లో మరోమూడు కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో సరికొత్త స్విఫ్ట్, eVX మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ లో వ్యాగన్ ఆర్, eWX ఉన్నాయి. మునుపటి రెండు మోడల్‌లు 2024లో దేశంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నప్పటికీ, eWX గురించి ఈ ఆటోమేకర్ ఇంకా ఎలాంటి టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప