- 2005లో మొదటిసారిగా పరిచయం చేయబడ్డ హ్యాచ్ బ్యాక్
- ప్రస్తుతం ఫోర్త్ జనరేషన్ మోడల్ గా అందించబడుతున్న స్విఫ్ట్ మోడల్
ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన మరియు మోస్ట్ పాపులర్ మోడల్స్ లో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటిగా నిలిచింది. ఇండియాలో స్విఫ్ట్ మొదటి మొదటి జనరేషన్ మోడల్ 2005లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఫోర్త్ జనరేషన్ వరకు మొత్తం 30లక్షల యూనిట్ సేల్స్ సాధించినట్లు ఇండియన్ ఆటోమేకర్ ప్రకటించింది.
మొదటిసారిగా మారుతి ద్వారా పాపులర్ హ్యచ్ బ్యాక్ 2005లో పరిచయం చేయబడగా, అద్బుతమైన సేల్స్ రికార్డుతో మారుతి కంపెనీ 2013లో 10 లక్షల స్విఫ్ట్ కార్లను విక్రయించి కొత్త మైల్‍స్టోన్ ని క్రియేట్ చేసింది. 2018లో ఈ సేల్స్ నంబర్లు డబుల్ అయ్యి 20 లక్షలకు చేరుకున్నాయి. దాని తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం స్విఫ్ట్ దాని ఫోర్త్ జనరేషన్ ఫేజ్ ద్వారా 30 లక్షల సేల్స్ మార్కును చేరుకుని ఇండియాలో తిరుగులేని మోడల్ గా నిలిచింది.
ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ఇండియాలో ఈ సంవత్సరమే లాంచ్ కాగా, ఈ మోడల్ ప్రస్తుతం రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కొత్త స్విఫ్ట్ ఇప్పుడు పూర్తిగా కొత్త ఇంజిన్ ని పొందడంతో దీని ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మెరుగైంది. అంతే కాకుండా ఇప్పుడు స్విఫ్ట్ కారులో మరిన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా తోడవడంతో సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్