- వివిధ వేరియంట్‌లలో అందించబడనున్న మెడల్
- 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి రానున్న ఇంజిన్
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ లాంచ్ అయినప్పటి నుండి, ఇండియన్ మార్కెట్ లో హ్యాచ్‌బ్యాక్ సిఎన్‍జి వెర్షన్ లాంచ్ గురించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‍జి లాంచ్ టైమ్‌లైన్‌కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో మనం చదివి తెలుసుకుందాం.
మాకు అందిన సమాచారం ప్రకారం, స్విఫ్ట్ సిఎన్‍జి వెర్షన్ సెప్టెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ కారు వివిధ వేరియంట్లలో అందించబడుతుంది. మెకానికల్‍గా, కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా బూట్ లోపల 60-లీటర్ సిఎన్‍జి ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్‌లో, స్విఫ్ట్ సిఎన్‍జి దాదాపు 70 bhp మరియు 100Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికొస్తే, స్విఫ్ట్ కొత్త Z-సిరీస్ ఇంజిన్ 24.8కెఎంపిఎల్ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. అలాగే, సిఎన్‍జి వెర్షన్‌తో, స్విఫ్ట్ 30కిలోమీటర్ల/కిలో కంటే ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందించనుంది. ముఖ్యంగా చెప్పాలంటే, మునుపటి-జెన్ స్విఫ్ట్ సిఎన్‍జి 30.9కిలోమీటర్ల/కిలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందిస్తుంది.
లాంచ్ తర్వాత, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‍జి వేరియంట్ ప్రీమియం ధర రూ. 60,000 నుంచి రూ.80,000 ఎక్కువ ఉంటుండగా, స్టాండర్డ్ వెర్షన్ కంటే ఎక్కువ డిమాండ్ తో లభిస్తుంది. అలాగే లాంచ్ తర్వాత, స్విఫ్ట్ సిఎన్‌జి ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు టాటా టియాగో సిఎన్‌జి వంటి వాటికి పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప