- రూ. 8.19 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లభ్యం
- 32.85కిలోమీటర్ల/కిలో క్లెయిమ్ చేయబడిన మైలేజీని అందిస్తున్నమోడల్
మారుతి సుజుకి ఇటీవలే దాని సిఎన్‍జి పోర్ట్‌ఫోలియోలో కొత్త హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ని కూడా చేర్చింది. కొత్త స్విఫ్ట్ సిఎన్‍జి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది, దీని ధరలు రూ. 8.19 లక్షల నుండి రూ. 9.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇప్పుడు, లాంచ్ అయిన తర్వాత, సిఎన్‍జి-ఆధారిత స్విఫ్ట్ ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‍జి VXi, VXi (O), మరియు ZXi. టాప్-ఆఫ్-లైన్ ZXi వేరియంట్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో, ఎల్ఈడీ లైట్ సెటప్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, తొమ్మిది-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మరియు కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్‍గా, స్విఫ్ట్ సిఎన్‍జి 1.2-లీటర్ Z-సిరీస్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో , ఇంజిన్ స్టాండర్డ్ మోడ్ 80bhp మరియు 112Nmటార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిఎన్‍జి మోడ్ లో మారినప్పుడు, ఈ మోటార్ పవర్ అవుట్‌పుట్ 69bhp మరియు 102Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికొస్తే, స్విఫ్ట్ సిఎన్‍జి వెర్షన్ మాక్సిమం 32.85కిలోమీటర్ల/కిలో మైలేజీని అందిస్తుంది.
మరో వార్తలలో చూస్తే, ఆటోమేకర్ కొత్త స్విఫ్ట్ కాంపాక్ట్-సెడాన్ వెర్షన్, కొత్త-జెన్ డిజైర్‌ను నవంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జనరేషన్ అప్‌డేట్‌తో, కొత్త డిజైర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లను పొందుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప