- 3 వేరియంట్లలో లభ్యం
- రూ. 8.19 లక్షలతో ధరలు ప్రారంభం
మారుతి కొత్త స్విఫ్ట్‌లో సిఎన్‍జి పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేస్తుందని ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా, ఆటో మేకర్ ఈరోజు సిఎన్‍జి-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్ ధరలను ప్రకటించింది. 2024 స్విఫ్ట్ లో ఇప్పుడు సిఎన్‍జి వెర్షన్ రూ. 8.19 లక్షల ప్రారంభ ధరతో,3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ కథనంలో, మేము కొత్త స్విఫ్ట్ సిఎన్‍జి క్లెయిమ్ చేసిన మైలేజ్ వివరాలను లిస్ట్ చేసాము.
నేడే లాంచ్ అయిన కొత్త మారుతి స్విఫ్ట్ సిఎన్‍జి VXi, VXi (O), మరియు ZXi అనే వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ Z-సిరీస్ మూడు-సిలిండర్ ఇంజిన్ 60 లీటర్ల సామర్థ్యంతో ఒకే సిఎన్‍జి ట్యాంక్‌తో వచ్చింది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, 69bhp మరియు 102Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. దీని మైలేజ్ విషయానికొస్తే, కొత్త స్విఫ్ట్ సిఎన్‍జి ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజ్ 32.85కిలోమీటర్లు/కిలో వరకు మైలేజీని అందిస్తుంది.ఇది మునుపటి- జనరేషన్ స్విఫ్ట్ సిఎన్‍జి కంటే 6 శాతం ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందిస్తుంది.
ఆర్డర్ చేసిన తర్వాత, కస్టమర్‌లు 2024 అక్టోబర్ 12వ తేదీ నుండి స్విఫ్ట్ సిఎన్‍జిని అందుకోవడం ప్రారంభమవుతుంది. అలాగే, స్విఫ్ట్ లేటెస్ట్ జనరేషన్ లాంచ్ అయిన కేవలం 4 నెలలకే మార్కెట్‌లో, ఇప్పటికే ఇండియా అంతటా 67,000 కారు అమ్మకాలను నమోదు చేసింది. ఇప్పుడు, సిఎన్‍జి వెర్షన్ పరిచయంతో, స్విఫ్ట్ సిఎన్‍జి రాకతో బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో 14వ మోడల్‌గా నిలిచింది.
అనువాదించిన వారు: రాజపుష్ప