- అధికారిక యాక్సెసరీస్ ని ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా లభించే అవకాశం
- డీలర్‌షిప్‌ల ద్వారా అమర్చబడుతున్న యాక్సెసరీస్
మారుతి సుజుకి ఈ నెల ప్రారంభంలో ఇండియాలో కొత్త స్విఫ్ట్‌ను రూ.6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కార్‌మేకర్ హ్యాచ్‌బ్యాక్ ఫోర్త్-జనరేషన్ లో వివిధ యాక్సెసరీస్ లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, థ్రిల్ ఛేజర్ మరియు రేసింగ్ రోడ్‌స్టర్ అనే రెండు ప్యాకేజీలు కూడా రూ. 29,500 నుండి అదనపు ధరతో ఆఫర్‌లో ఉన్నాయి. దాని పూర్తి యాక్సెసరీస్ వెర్షన్ వివరణ ఇక్కడ ఉంది.
యాక్సెసరీస్ ఫోటో గ్యాలరీ
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, యాక్సెసరీ ప్యాక్‌లలో బంపర్స్, ఇంజిన్ హుడ్, రూఫ్, మిర్రర్స్, సైడ్ డెకాల్స్ వంటి వాటితో కారు ఎక్స్‌టీరియర్ లుక్ ని మెరుగుపరిచే అనేక ఇతర అంశాలు లో కాస్మెటిక్ యాడ్-ఆన్‌లు ఉన్నాయి.
అదే విధంగా, కస్టమర్‌లు డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్స్ మరియు సీట్స్ ఇంటీరియర్‌ను కూడా ట్వీక్ చేయవచ్చు. ఇంతేకాకుండా, డోర్ సిల్స్‌తో పాటు, కస్టమర్‌లు ప్రత్యేక కీ కవర్‌ను కూడా పొందవచ్చు.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
స్విఫ్ట్ ఇటరేషన్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 80bhp మరియు 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప