- 16 మోడల్స్ లో అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ వేరియంట్స్
- ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే నమోదైన లక్ష ఆటోమేటిక్ యూనిట్ సేల్స్
మారుతి సుజుకి ఇండియాలో 10 లక్షల ఆటోమేటిక్ వెహికిల్ సేల్స్ సాధించి మరొక మైల్‍స్టోన్‍ని అధిగమించింది. ప్రస్తుతం, ఇండియన్ ఆటోమేకర్ ఇండియాలో తన 16 మోడల్స్ ను ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తో విక్రయించింది.
ప్రస్తుతానికి, మారుతి సుజుకి 4 రకాల ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ని అందిస్తుంది. అవి ఏవి అంటే, ఆటో గేర్ షిఫ్ట్(ఎజిఎస్), 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, మరియు ఒక ఈ-సివిటి యూనిట్. బ్రాండ్ ప్రకారం చూస్తే, ఈ తయారీ సంస్థ 65% ఆటోమేటిక్ వెహికిల్స్ ను ఎజిఎస్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లోనే విక్రయించింది. అదే విధంగా, ఈ బ్రాండ్ కి సంబంధించి మొత్తం ఆటోమేటిక్ సేల్స్ లో 27% ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్స్ నుంచి వచ్చినవే ఉండడం గమనార్హం.
మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ దీనిపై మాట్లాడుతూ “ మారుతి సుజుకి ద్వారా కస్టమర్స్ కు బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ‘జాయ్ ఆఫ్ మొబిలిటీ’ని అందించడమే మా లక్ష్యం. అనేక ఆప్షన్స్ ద్వారాఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ తీసుకువచ్చి అందరికి దగ్గరయ్యేలా చేసింది. ఎంఎస్ఐఎల్ ఆటోమేటిక్ కార్ల విక్రయాలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం, ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్నా సరే మేము 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి లక్ష ఆటోమేటిక్ వెహికిల్స్ విక్రయించి కొనుగోలు లక్ష్యాలను సాధించాము. ఓ రకంగా ఇది మాకు ఒక అద్బుతమైన ఫీట్” అని తెలిపారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్