- 2024 మే నెలలో లాంచ్ అయిన ఫోర్త్-జనరేషన్ మోడల్
- ప్రస్తుతం 2 నుండి 3 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉన్న స్విఫ్ట్
మారుతి సుజుకి ఇటీవల దాని రేంజ్ విక్రయాల నెంబర్లను ప్రకటించింది మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లాంచ్ అయినప్పటి నుండి 35,800 యూనిట్ల అమ్మకాలను అధిగమించిందని వెల్లడించింది.న్యూ-జనరేషన్మోడల్ 2024 మే నెలలో లాంచ్ కాగా, రెండు నెలల్లోపే ఈ 35,800 యూనిట్ల ఈ సేల్స్ మైలురాయిని సాధించింది.
గత నెలలో, ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ పై 40,000 బుకింగ్‌లను ఆటోమేకర్ పొందినట్లు మేము మీకు నివేదించాము. ముఖ్యంగా, అదే సమయంలో స్విఫ్ట్ అమ్మకాలు 19,000 యూనిట్లుగా ఉండగా, ప్రస్తుతం, స్విఫ్ట్ రూ. 6.49 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లభిస్తుండగా, దీనిపై 3 వారాల వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతుంది.
బ్రాండ్ ఇటీవల భారీ మైలురాయిని ప్రకటించినందున స్విఫ్ట్ నేమ్‌ప్లేట్ ప్రస్తుతం ఎక్కడ చూసినా బెస్ట్ ఫిగర్స్ తో వార్తల్లో కనిపిస్తుంది. స్విఫ్ట్ మోడల్ ఇటీవలే లాంచ్ అయినప్పటి నుండి 30 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించింది. స్విఫ్ట్ మొట్ట మొదటిసారిగా 2005లో ప్రవేశపెట్టబడింది మరియు ప్రస్తుతం దాని ఫోర్త్-జనరేషన్ మార్కెట్లో విక్రయించబడుతుంది.
అంతేకాకుండా, మారుతి బ్రాండ్ అతి త్వరలో స్విఫ్ట్‌లో సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ ని కూడా ప్రవేశపెట్టబడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.ఈ మోడల్ ప్రస్తుతం మూడు సిలిండర్ల రూపంలో కొత్త 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 80bhp మరియు 112Nm టార్క్‌ను ఉత్పత్తిచేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప