- ఇండియాలో అతిపెద్ద సిఎన్‍జి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఆటోమేకర్ మారుతి
- త్వరలో సిఎన్‍జి రేంజ్ లో కూడా రానున్న స్విఫ్ట్
మారుతి సుజుకి, దాని త్రైమాసిక మరియు నెలవారీ అమ్మకాల సంఖ్యను ప్రకటిస్తూ, ఆర్థిక సంవత్సరం 2024 మొదటి త్రైమాసికంలో దాని సిఎన్‍జి కార్ల పెర్ఫార్మెన్స్ ను వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో అతిపెద్ద సిఎన్‍జి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఆటో మేకర్ ఏప్రిల్ నెల నుండి జూన్ 2024 వరకు అంటే కేవలం మూడు నెలల్లోనే 1.38 లక్షల యూనిట్ల సిఎన్‍జి కార్ల విక్రయాలను నమోదు చేసింది.
త్రైమాసిక కాలంలో ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్ లో మొత్తం 4.14 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, వీటిలో మొత్తం 1.38 లక్షల కార్లు సిఎన్‍జి ఫీచర్లతో పాటుగాఅమర్చిన మోడల్స్ ఉన్నాయి . ప్రస్తుతం, ఈఇండియన్ ఆటోమేకర్ ఆల్టో K10, సెలెరియో, ఈకో, S-ప్రెస్సో, వ్యాగన్ R, డిజైర్, బ్రెజా, ఎర్టిగా, బాలెనో, ఫ్రాంక్స్, XL6 మరియు గ్రాండ్ విటారాతో సహా 12 సిఎన్‍జి-పవర్డ్ మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే,ఇందులో మొదటి 8 మోడల్‌లు అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్నాయి, మిగిలిన 4 మోడళ్లు ఈ బ్రాండ్ ప్రీమియం నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా అందించబడ్డాయి.
అంతేకాకుండా,మరికొన్ని నెలల్లో ఇటీవల లాంచ్ అయిన కొత్త-జెన్ స్విఫ్ట్ కారులో కూడా సిఎన్‍జి వేరియంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, పాపులర్ హ్యాచ్‌బ్యాక్, ఫోర్త్-జనరేషన్ అప్‌డేట్‌కు ముందే, ఆటోమేకర్ సెలెక్ట్ చేసిన వేరియంట్‌లలో మాత్రమే సిఎన్‍జిని అందించింది.ముఖ్యంగా, ఎంపివి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43,000 ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉన్నందున ఎర్టిగా సిఎన్‍జి పై అధిక డిమాండ్ కొనసాగుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప