- ఈఎస్‍పీని పొందుతున్న ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 కార్లలోని అన్నీ వేరియంట్లు
- ఎలాంటి మార్పులు లేని ధరలు
బడ్జెట్ కార్లను కొనుగోలు చేసేవారు ఎస్-ప్రెస్సో మరియు ఆల్టో K10 కార్లను అమితంగా ఇష్టపడతారు. అయితే, ఎవరైతే ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటి అంటే, ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 కార్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ఈఎస్‍పీ)ని స్టాండర్డ్ గా తీసుకువస్తున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండానే, ఈ కార్లలోని అన్నీ వేరియంట్లలో ఈ సేఫ్టీ ఫీచర్లను మారుతి సుజుకి తీసుకువస్తుంది.
ఎస్-ప్రెస్సో మరియు ఆల్టో K10 కార్లు మారుతి నుంచి అత్యంత చవకగా లభించే ఎంట్రీ-లెవెల్ కార్లు కాగా, ఇవి “బ్రాండ్ హార్టెక్ట్” ప్లాట్ ఫారం ఆధారంగా వచ్చాయి. ఈ రెండు కార్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్) , కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, మరియు మరెన్నో ఫీచర్లను పొందుతాయి. ఈ కార్లలో కొత్తగా జతచేయబడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ఈఎస్‍పీ) వెహికిల్ స్టెబిలిటీని మరియు యాక్సిడెంట్లను నివారించడంలో సహాయపడుతుంది. ఈఎస్‍పీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంతో ఈఎస్‍పీ సమన్వయం ఏర్పరచుకొని జారిపోయేలా ఉన్న రోడ్లపై లేదా విపత్కరమైన రోడ్లపై కారును స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది.
ఈ కార్లలోని ఇంతకు ముందు మోడల్స్ జిఎన్ క్యాప్ క్రాష్ టెస్టులలో సేఫ్టీ రేటింగ్స్ కోసం పాల్గొనగా, అందులో వీటికి ఘోరమైన రేటింగ్స్ లభించాయి. ఇప్పుడు వీటిలో కొత్త సేఫ్టీ ఫీచర్లను తీసుకురావడం కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరిన్ని సేఫ్టీ ఫీచర్లు, మరియు కొత్త టెక్నాలజీని వీటికి జతచేయడం ద్వారా ఈ కార్లు మెరుగైన సేఫ్టీ రేటింగ్‌లను సాధిస్తాయి. అలాగే, కస్టమర్లు సేఫ్ ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేయడానికి ఈ సేఫ్టీ ఫీచర్లు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్