- మారుతి సుజుకిలో సిఎన్‍జి వెర్షన్ లో అందుబాటులో ఉన్న 13 మోడల్స్
- ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన సిఎన్‍జి కార్లు
మారుతి సుజుకి తాజాగా 2023-24 సంవత్సరం రెండవ త్రైమాసికంకు సంబంధించి సేల్స్ రిపోర్టును రిలీజ్ చేసింది. ఈ ఇండియన్ ఆటోమేకర్ నంబర్స్ పరంగా 5.50 లక్షల యూనిట్లకు పైగా విక్రయించి, త్రైమాసికానికి సంబంధించి అత్యధిక సేల్స్ ని రిజిస్టర్ చేసింది. ఇంకా చెప్పాలంటే, ఈ బ్రాండ్ జూలై నుంచి సెప్టెంబర్ పీరియడ్ వరకు మొత్తంగా చూస్తే 1.18 లక్షలకు పైగా సిఎన్‍జి కార్లను విక్రయించింది.
ప్రస్తుతం, మారుతి సుజుకి తమ సేల్స్ లో భాగంగా ఆల్టో K10, ఈకో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఎర్టిగా, XL6, గ్రాండ్ విటారా, బాలెనో, మరియు ఫ్రాంక్స్ వంటి 13 మోడల్స్ ను సిఎన్‍జి వెర్షన్ లో అందిస్తుంది. దీంతో, వివిధ సెగ్మెంట్స్ మరియు ధరల పరంగా సిఎన్‍జి-పవర్డ్ కార్లను అందిస్తున్న టాప్ బ్రాండ్ గా మారుతి సుజుకి కొనసాగుతుంది.
మరిన్ని వార్తలను చూస్తే, సుజుకి ఇండియా-బౌండ్ స్విఫ్ట్ కాన్సెప్టును టోక్యోలోని 2023 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించింది. ఈ హ్యచ్ బ్యాక్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ అప్ గ్రేడ్స్ తో 2024లో ఇండియన్ మార్కెట్లోకి రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్